
వివేక్ నిజంగా ఒక పోరాట యోధుడు. అందులో సందేహం లేదు. తాను నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలైనా అర్పించే తత్వం ఉన్న గొప్పవ్యక్తి. డబ్బుకోసం ఏ ఎండకి ఆ గోడుగు పట్టే నేటి ఆధునిక సమాజంలో పుట్టి ఇతరులకోసం ప్రాణాలను సైతం లెక్క చేయని త్యాగ జీవి. అదే సందర్భంలో ఎంతో మందిని రిక్రూట్ చేసుకుంటున్నా ఈ వివేక్ మాత్రమె ఎలా పోలీసులకి దొరికి ఎన్కౌంటర్ లో చనిపోయాడు అనే విషయంలో అతని కేడెర్ యొక్క అసమర్ధత కనిపిస్తుంది. ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా అనుమానించాల్సి వస్తుంది. ఇన్నాళ్ళుగా ఇన్ని కుమ్బింగ్స్ లో దొరకని ఎంతోమంది వున్నారు. కాని ఇతను మాత్రం ఒక్కడే ఎలా దొరికాడు. నిజాలు నిదానంగా తెలుస్తాయి.
తుపాకి ఎందుకు పట్టాలి?
ఒక వ్యక్తీ మనల్ని రాయితో కొడుతుంటే మనం రాయితో కొడతాం, కర్రపట్టుకొని వస్తే మనం కూడా కర్రపట్టుకుంటాం అలాగే తుపాకి పట్టుకొని వస్తే తుపాకి పట్టుకోవాలి. తప్పదు. ఎందుకంటె ఇది బతుకు పోరాటం. అహింసా సిద్దాంతం అన్నివేళలా పనిచేయదు. అహింసా సిద్దాంతం గాంధీగారు చేయడానికి అప్పటి రాజకీయ పరిస్తితులు అనుకూలించాయి. ప్రపంచంలో బ్రిటిషర్స్ కి రాజకీయంగా వ్యతిరేకత కలిగే అవకాసం వుంటుంది. అంతర్జాతీయ పరిస్తితులు అనుకూలించాయి. అందుకే అహింస అని తల వంచినా ఏమీ చేయలేకపోయారు బ్రిటిషర్స్. కాని స్వాతంత్ర్యం వచ్చాక మనదేశ అంతర్గత పరిస్తితులు అలా లేవు. నాటి భూస్వాములు లేదా నవాబులు పరిపాలన అత్యంత దౌర్జన్యంగా, అరాచకంగా వుండేది. అహింసా అంటే హింసని చూపించే పరిస్తితి. విసిగి వేసారిన ప్రజలు తిరగబడ్డారు. భూస్వామ్య వ్యవస్త మీద అతి సాధారణ ప్రజలు తుపాకి పట్టి తెలంగాణా సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య వ్యవస్థ మీద పోరాడి ఆ వ్యవస్తనే లేకుండా చేయగలిగారు. ఆ స్పూర్తి ప్రజలలో ఇప్పటికీ చాటుకుంటూనే వున్నారు. తెలంగాణా అనే పదం సాయుధపోరాటం ద్వారా చిరకాలం ఈ ప్రపంచానికే గుర్తుండి పోతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ సాయుధపోరాట స్పూర్తి తెలంగాణాని విడిగానే చూసింది. నేటికి అది తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఒక రాష్ట్రంగా ఏర్పడింది.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న చర్చ మరొక ఎత్తు. నాయకుల పిల్లలని ఎందుకు బలివ్వరు అని. వాళ్ళ పిల్లలని మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారు అని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయ్. ఇందులో నిజాలు లేకపోలేదు. కాని పూర్తిగా ఇక్కడి రాజకీయ వ్యవస్తలో బ్రస్తుపట్టిపోయిన ప్రజలు ఇది మాట్లాడడం విడ్డూరం. వీళ్ళకి కనీస అర్హత కూడా లేదు.
ఏదేమైనా నాటి నక్సలిజం వేరు నేటి ఇజం వేరు. ఆరోజుల్లో ప్రజల్లో సానుభూతి మెండుగా వుండేది. నేడు అది లేదు. పూర్తిగా తగ్గిపోయింది. కేవలం ఆ సానుభూతి కొన్ని చిట్ట చివరి పీడిత ప్రజలలోనే కనిపిస్తుంది. దానికి కారణం కూడా నక్సల్స్ అవలంబిస్తున్న విధానాలే.
రాజులు సైన్యాన్ని ముందుపెట్టి యుద్ధం చేసినట్టు నేడు పాలకులు కూడా పోలీసులని ముందుపెట్టి వాళ్ళని బలిచేస్తున్నారు. ఇది వ్యవస్తలో తప్పుకాకపోయిన నక్సల్స్ మాత్రం ఆ సైన్యం వెనకపడుతూ ప్రజలను హింసిస్తున్న పాలకులని మాత్రం వదిలేస్తూ ప్రజల్లో సానుభూతిని కోల్పోతున్నారు. 20 ఏళ్ళ క్రితం ఏ నాయకుడు తప్పు చేయాలన్నా అన్నలు వున్నారు చంపేస్తారు అనే భయం వుండేది. కాని నేడు అది లేదు పైగా వాళ్ళతోనే లాలూచి పడే స్తాయికి దిగజారి పోయి తమ సిద్దాంతాన్ని వదిలేసి తమ ఉనికిని కోల్పోతున్నారు.
రాజులు సైన్యాన్ని ముందుపెట్టి యుద్ధం చేసినట్టు నేడు పాలకులు కూడా పోలీసులని ముందుపెట్టి వాళ్ళని బలిచేస్తున్నారు. ఇది వ్యవస్తలో తప్పుకాకపోయిన నక్సల్స్ మాత్రం ఆ సైన్యం వెనకపడుతూ ప్రజలను హింసిస్తున్న పాలకులని మాత్రం వదిలేస్తూ ప్రజల్లో సానుభూతిని కోల్పోతున్నారు. 20 ఏళ్ళ క్రితం ఏ నాయకుడు తప్పు చేయాలన్నా అన్నలు వున్నారు చంపేస్తారు అనే భయం వుండేది. కాని నేడు అది లేదు పైగా వాళ్ళతోనే లాలూచి పడే స్తాయికి దిగజారి పోయి తమ సిద్దాంతాన్ని వదిలేసి తమ ఉనికిని కోల్పోతున్నారు.
ఇటువంటి సందర్భంలో ఇలా ఒక చదువుకున్న వ్యక్తి, యువకుడు ఈ అన్నలకి చేరువవ్వడం వింత కాకపోయినా తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఇది పూర్తిగా అతని వ్యక్తిగతమే అయినా తను ఎంచుకున్న మార్గం మాత్రం ప్రజలకోసమే అని మనం నమ్మాలి. నేడు ఈ వ్యవస్తలో ఉన్న అనేకానేక రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు చేయలేని సాహసం, తెగువ చూపి ప్రజలకోసం చివరికి ప్రాణాలు అర్పించాడు.
ఇప్పుడున్న నాయలుకుల పిల్లలు ఎందుకు చేయరు అనేది పూర్తిగా అసంబద్దమైన వాదన. ఎందుకంటె ఒక సిద్దాంతానికి కట్టుబడడం, ఫాలో అవ్వడం అనేది ఆ వ్యక్తీ యొక్క సొంత నిర్ణయం. అది పూర్తిగా వ్యక్తిగతం. ఈ ప్రపంచంలో ఉన్న అనేకానేక రుగ్మతలు నిత్యం ప్రజలని తప్పుదారి పట్టిస్తుంటాయి. యెంత కాదన్నా నేడు ఇలా ప్రాణాలు అర్పించేవారి మూలాలు తమ తమ పూర్వికులనుండి పొందిన స్పూర్తి చాలా వుంటుంది. అంటే నేడు ఉన్న కమ్యునిస్ట్ ల కుటుంబాల లో నుండే ఎక్కువగా రేపటి తరం వస్తుంది. కొత్తగా వచ్చి సిద్దాంతాన్ని అర్ధంచేసుకొనే వాళ్ళ కన్నా ఇలా తరాలుగా కమ్యునిస్ట్ కుటుంబాలలోనుండి వచ్చేవాల్లె ఎక్కువ వుంటారు. ఆ విషయాన్ని మరిచి కేవలం కొంతమంది అగ్ర నాయకుల పిల్లలు ఎందుకు రారు అనే ప్రశ్న వేస్తె మీకు ఈ సిద్దాంతం మీద అవగాహన రాహిత్యాన్ని మాత్రమె తెలియజేస్తుంది. ఇక్కడ పూర్తిగా వ్యక్తిగత స్వేఛ్చ వుంటుంది. ఈ దారిలో వుండే ముళ్ళని వివేక్ కి కూడా తల్లిదండ్రులో లేదా పరిచయం వున్నా నాయకులో చెప్పే వుంటారు. దానికి సిద్దపడి వచ్చినవాళ్ళే వస్తారు. బలవంతంగా వుంచడం, చేర్పించుకోవడం ఇక్కడ జరగదు, సాద్యం కూడా కాదు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటె ఎంతోమంది లొంగిపోయిన వ్యక్తులు నేడు స్వేచ్చగా ఉండడానికి కారణం కూడా ఎవరి బలవంతం లేకపోవడమే.
ప్రజల బాగుకోసం ఏర్పడే ప్రభుత్వాలు అవి చేయనప్పుడు, వాటిని చూస్తూ ప్రజలు ఊరుకుంటుంటే ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ప్రజలకోసం ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్దపడే ఇలాంటి వివేక్ లు పుట్టుకొస్తూనే వుంటారు.
అతడిని గొప్పవాడిగా చూడకపోయినా పర్లేదు - విమర్శించే హక్కు ఇక్కడ ఎవ్వడికీ లేదు... నిజంగా ఎవ్వడికీ లేదు. ఒకవేళ మీకు వుంటే అందుకు తగిన ఆధారాలతో కామెంట్ చేయండి.