::: మా జామచెట్టు vs రాజధాని :::

మా జామచెట్టు. మా తాత వేసిన చెట్టు. కాయల సైజు చిన్నగా ఉంటాయ్. కాని లోపల అంతా పింక్ కలర్ లో చాలా అందంగా, తియ్యగా ఉంటాయ్. ఊళ్ళో ప్రతి పిల్లోడికీ దానిమీదే చూపు. రెండు తరాలం ఎంతో ఇష్టంగా ఆ చెట్టు కాయలు తింటూనే వున్నాం. ఇప్పుడది ఒక జ్ఞాపకం కాబోతుంది. అలాగే దారిపొడవునా రేగిచేట్లు చేయి చాచి కోసుకొని తినేంత దగ్గరలో. తాటికాయలు, ఈతకాలు. పచ్చని పైరుల మద్య అరుగులు. ఇంకా ఎప్పటికీ ఆ మధురమైన భావనలు మా జ్ఞాపకాల్లోనే. ఇలాంటి వాటికోసమే సెలవోస్తే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు తమ ఊళ్ళకి వెళ్ళేది. అలాంటి ఆటవిడుపు గ్రామాలు మా పొలాలు ఇక జ్ఞాపకాలే.
ఎందుకంటె మాకు రాజధాని వచ్చింది. ఒక పక్క సంతోషం. మొరోపక్క ముల్లులా గుచ్చుకొనే వాస్తవాలు, జ్ఞాపకాలు. నాలాగే చాలామంది ఇప్పుడున్న మంచి జీవితాన్ని, వాతావరణాన్ని, జ్ఞాపకాలని వదిలేసి మదిలో ఏవేవో కొత్త ఆశలతో రోజుల్ని భారంగా నేట్టేస్తున్నాం. తప్పదు.
కోట్లడబ్బు ఆనందాన్ని ఇస్తుంది అని ఏ కోటీశ్వరుడు చెప్పట్లేదు. కాని కోట్లవైపు మధ్యతరగతి చూస్తూ స్వత్చమైన ఆనందాన్ని ఇస్తున్న ఎన్నో జ్ఞాపకాలని పరిస్తితుల్ని వదిలి వెళ్తున్నాం.
కాని ఒక్కటి మాత్రం నిజం. ఇలాంటి పచ్చని పొలాలు ఇజ్రాయిల్ లాంటి దేశాల వాళ్లకి వుంటే వాళ్ళు ఈ పని చేయరు అని నమ్ముతా. ఎందుకంటె చుక్క నీటికోసం, ఒక మొక్క పెంచడం కోసం వాళ్ళు అక్కడ ఎంతకస్తాపడుతున్నారో ప్రపంచానికి తెలుసు. మనకి ఉండి నాశనం చేసుకుంటున్నాం. లేక వాళ్ళు కష్టపడుతునారు.
అలాగే మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించు కోవాలి. ఇక్కడ రాజధాని వస్తుంది అని, అలాగే ఎక్కువ ధర వస్తుంది అని మనం మన భూములని స్వచ్చందంగా ఇచ్చినా ఆ వచ్చిన డబ్బుతో ఏం చేయాలి. ఈ మద్య కాలంలో భూమి విలువే అత్యంత వేగంగా పెరుగుతుంది. దానికి కారణం కూడా ప్రజలు, వాళ్ళ అవసరాలు పెరిగిపోవడం. అలాంటి భూమిని వదిలేసి, చిన్న స్తలం రాజధానిలో ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం. లేదా మల్లి ఎక్కడో ఒకచోట భూమిని కొనుక్కోవాలి. సరే కొనుక్కుంటాం కాని ఇక్కడున్నంత నీటి వసతి, భోగోలికంగా నష్టం చేయని వాతావరణం, అలవాటు పడ్డ వ్యవసాయం ఇవన్నీ ఉంటాయా. సరే వున్నా రేపు మల్లి ఏ సెజ్ కో అవి కూడా లాక్కోరు అని నమ్మగలమా.
మనం ఎంతో మందిని కాలి చేయించి ప్రకాశం బారేజి కట్టుకున్నది దేనికోసం, నీటి అవసరాలకి, వ్యవసాయానికి. ఇలా నీటిని ఒడిసిపట్టి సాగులోకి తెచ్చుకున్న సాగుభూములనే నాశనం చేసి కట్టడాలు కట్టేందుకు ఉపయోగిస్తున్నారు అంటే యెంత అనాగరికమైన చర్యో అర్ధం చేసుకోవచ్చు. భూమికి మనం భారం కాకూడదు. ఎందుకంటె అది మనల్ని భారం అనుకుంటుంది తప్పకుండా.
అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం. దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా ఉంటున్న ఆ నేల ఎన్ని కోట్ల విలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా.
అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు.
రైతుకి భూమి విలువ పెరగడం అంటే తనపోలం అన్నపూర్ణగా ఉన్నప్పుడే. "నీకేంట్రా సాంబయ్యా నీ పొలం మూడు పంటలు పండుద్ది నీకన్నా లచ్చాదికారి ఎవడ్రా వూళ్ళో" అంటుంటారు ఇప్పరికీ గ్రామాల్లో. ఇలాంటి అన్నపూర్ణగా ఉన్న నేల ఈ రెండు జిల్లాలలో ఇంకోచోట లేదు.
కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు పెరగడం కన్నా దాని విలువ పెరగడమే ముక్యం.
రాజధానే కట్టాల్సివస్తే ఇప్పుడు అనుకొనే తుళ్ళూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని ఉపయోగించి రాజధాని కట్టి దానికి విలువ పెంచితే చాలా చాలా బావుండేది. అది వదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే అది సమర్ధనీయం కాదు. అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.
ఎందుకంటె ఈ దేశం లో ఇలాంటి చర్యలే జరుగుతుంటే ఇంకొన్నాళ్ళకి అన్నపూర్ణగా ఉన్న మనదేశం అన్నమో రామచంద్రా అని ఇజ్రాయిల్ లాంటి దేశాలని అర్దిన్చాల్సివస్తుంది.

మా జామచెట్టు. మా తాత వేసిన చెట్టు. కాయల సైజు చిన్నగా ఉంటాయ్. కాని లోపల అంతా పింక్ కలర్ లో చాలా అందంగా, తియ్యగా ఉంటాయ్. ఊళ్ళో ప్రతి పిల్లోడికీ దానిమీదే చూపు. రెండు తరాలం ఎంతో ఇష్టంగా ఆ చెట్టు కాయలు తింటూనే వున్నాం. ఇప్పుడది ఒక జ్ఞాపకం కాబోతుంది. అలాగే దారిపొడవునా రేగిచేట్లు చేయి చాచి కోసుకొని తినేంత దగ్గరలో. తాటికాయలు, ఈతకాలు. పచ్చని పైరుల మద్య అరుగులు. ఇంకా ఎప్పటికీ ఆ మధురమైన భావనలు మా జ్ఞాపకాల్లోనే. ఇలాంటి వాటికోసమే సెలవోస్తే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు తమ ఊళ్ళకి వెళ్ళేది. అలాంటి ఆటవిడుపు గ్రామాలు మా పొలాలు ఇక జ్ఞాపకాలే.

కోట్లడబ్బు ఆనందాన్ని ఇస్తుంది అని ఏ కోటీశ్వరుడు చెప్పట్లేదు. కాని కోట్లవైపు మధ్యతరగతి చూస్తూ స్వత్చమైన ఆనందాన్ని ఇస్తున్న ఎన్నో జ్ఞాపకాలని పరిస్తితుల్ని వదిలి వెళ్తున్నాం.

అలాగే మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించు కోవాలి. ఇక్కడ రాజధాని వస్తుంది అని, అలాగే ఎక్కువ ధర వస్తుంది అని మనం మన భూములని స్వచ్చందంగా ఇచ్చినా ఆ వచ్చిన డబ్బుతో ఏం చేయాలి. ఈ మద్య కాలంలో భూమి విలువే అత్యంత వేగంగా పెరుగుతుంది. దానికి కారణం కూడా ప్రజలు, వాళ్ళ అవసరాలు పెరిగిపోవడం. అలాంటి భూమిని వదిలేసి, చిన్న స్తలం రాజధానిలో ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం. లేదా మల్లి ఎక్కడో ఒకచోట భూమిని కొనుక్కోవాలి. సరే కొనుక్కుంటాం కాని ఇక్కడున్నంత నీటి వసతి, భోగోలికంగా నష్టం చేయని వాతావరణం, అలవాటు పడ్డ వ్యవసాయం ఇవన్నీ ఉంటాయా. సరే వున్నా రేపు మల్లి ఏ సెజ్ కో అవి కూడా లాక్కోరు అని నమ్మగలమా.
![]() |
నిర్మాణంలో ఉన్న ప్రకాశం బారేజి |
అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం. దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా ఉంటున్న ఆ నేల ఎన్ని కోట్ల విలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా.
అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు.

కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు పెరగడం కన్నా దాని విలువ పెరగడమే ముక్యం.
రాజధానే కట్టాల్సివస్తే ఇప్పుడు అనుకొనే తుళ్ళూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని ఉపయోగించి రాజధాని కట్టి దానికి విలువ పెంచితే చాలా చాలా బావుండేది. అది వదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే అది సమర్ధనీయం కాదు. అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.
ఎందుకంటె ఈ దేశం లో ఇలాంటి చర్యలే జరుగుతుంటే ఇంకొన్నాళ్ళకి అన్నపూర్ణగా ఉన్న మనదేశం అన్నమో రామచంద్రా అని ఇజ్రాయిల్ లాంటి దేశాలని అర్దిన్చాల్సివస్తుంది.
No comments:
Post a Comment