ఈ విశ్వం లో మనమొక అనామకులం అని అనుకోక తప్పదు (ఇప్పటివరకు).
ఈ భూమి మీద జీవరాసి ఉండడానికి కారణం ఇక్కడున్న వాతావరణం. ఇలాంటి మరో భూమి మరోటి వుందో లేదో ఇప్పటికైతే కనుగొనబడలేదు. కాని వుండే అవకాసం వుంది. అదికనుగొనె లోపు ఈ భూమే అంతరించి పోవచ్చు.
2012 మూవీ లో చెప్పినట్లు కేవలం మానవ మనుగడే నాశనం అయితే పర్లేదు మనం అదే మూవీ లో చెప్పినట్లు మానవ మనుగడని కొనసాగించవచ్చు. కాని అలాకాకుండా ఈ భూమి పూర్తిగా అంతరించి పొతే జీవరాశిని కాపాడుకోవడం ఎలా. ఇప్పటివరకు భూమి మీద ఉన్నఅన్ని జీవరాసుల్లోకేల్లా మనిషే అత్యంత అభివృద్ధి చెందిన జీవి. ఆలోచనలో మనిషే అత్యున్నత జీవి.
కాబట్టి మనిషే మరో కొత్త ఎవల్యూషన్ కి బీజం వేసేలా అది మనం నిర్దేశించిన విధంగా ఎదిగేలా ఒక ప్రాజెక్ట్ చేపట్టాలి. అది ఎలా వుండాలి అంటే మనం ఎగ్రహం మీద అయినా మళ్ళీ మానవులు వుద్భవించెలా చేయగలిగిన ఎవల్యూషన్. ఏకకణ జీవినుండి మనిషి వరకు యెంత వీలయితే అంత తక్కువ కాలంలో తనకి అనువైన వాతావరణం రాగానే తనని తానూ సృస్తించుకొనే జీవరాసి యొక్క ప్రాధమిక కణాలను ఎగ్రహం మీద అయినా, ఎటువంటి వాతావరణం లోనైనా బద్రపరిచే ఒక వ్యవస్తని తయారుచేసుకోవాల్సిన ఆవశ్యకత వుంది. (ఇదంతా మనిషిగా ఇలాగే మనల్ని కాపాడుకోలేక పొతే చేయాల్సిన విషయం)
మనం సైన్స్ ని వుపయోగించి ఏ గ్రాహం మీద అయినా జీవరాసి ఉందేమో అని వెతుకులాడుతున్నాము. కాని మనం చేయాల్సిన పని ఇంకోటివుంది. మనకి అందుబాటులోవున్న ఏ గ్రాహం మీద అయినా పరిణామక్రమం జరిగే అవకాసం ఉన్న గ్రహం మీద కొన్ని ప్రాదమిక జీవ కణాలను దాచి వుంచడం, కుదిరితే అవి అక్కడి వాతావరణాన్ని తట్టుకొని ఎదిగేలా చేయడం. జీవరాసి ఎదగడానికి కావలసిన వాతావరణం కుత్రిమంగా ఎలా తయారుచేయాలో ఆలోచన చేయడం ... మొత్తంగా మనిషి తనని తానూ సృష్టించుకొనే ఒక ప్రాజెక్ట్ చేపట్టడం చాలాముక్యం....
ఎందుకంటె ఈ విశాల విశ్వంలో మనకి ఎప్పుడు ఎటునుండి ప్రమాదం పొంచివుందో చెప్పలేము.
నేనైతే ఈ వర్డ్స్ టైపు చేసి పోస్ట్ చేసే సమయంలోనే ఈ మొత్తం విశ్వం నాసనమైనా అవ్వొచ్చు అనుకొంటాను, ఎందుకంటె ఈ విశ్వం లో మనిషి తెలుసుకోవాల్సింది గూగుల్ కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో వుంది, ఎప్పుడు ఎటునుండి ప్రమాదం వస్తుందో తెలియదు కదా
మనకి అస్సలు టైం లేదు...
(ఇంకోటి ఈ పోస్టుకి ఈ ఇమేజ్ ఎందుకు పెట్టానంటే, సుమారుగా ఒక గంట వెదికాను ఈ పోస్టుకి సరిపోయే ఇమేజ్ కోసం, ఎందుకో నాకు ఇదే సరైనదేమో అనిపించింది. రెండు కణాల కలయికలా వుంది )
కొత్త
No comments:
Post a Comment