Humanity

Humanity

Tuesday, May 26, 2015

:: ఒక కోడి కథ ::

ఎందుకో తెలియదు కాని ప్రతి ఆదివారం చాలా త్వరగా మెలకువ వస్తుంది... 
అలాగే ఈ ఆదివారం కూడా.
ఉదయాన్నే 5 :30 కే ...
ఏమిచేయాలో తెలియక, నిదుర పట్టక లేచి బండి తీసి హైవే ఎక్కాను, టీ తాగుదాం అని...
హైవే దాటి టీ కొట్టు కి చేరగానే వెనకాలే పెద్ద శబ్దం,
ఎమైందా అని వెనక్కి తిరిగి చూసాను..
వేగంగా వెళ్తున్న ఒక కోళ్ళు తరలించే ఆటో కనపడింది,
మరి శబ్దం ఏమిటా అనుకుటుంటే, అంతలోకే రోడ్ పైన కనిపించాయి కోళ్ళు,
ఆటో లోంచి కింద పడ్డాయి. పాపం వాటి కాళ్ళు ఒకదానికొకటి కట్టివేసి ఉన్నాయ్.
ఇంతలోనే ఒక లారీ వేగంగా వాటి పైనుంచి వెళ్ళింది....
పాపం అనిపించింది, కాని ఏం చేస్తాం... తరువాత ఇంకో లారీ... ఇలా అక్కడున్న కాసేపట్లో చాలా లారీలు...
చాల సేపు మౌనంగా వాటినే చూస్తూ అక్కడే ఉన్నాను.

ఈ రోజు కూడా అవే గుర్తుకు వస్తున్నాయి.
నాకనిపిస్తుంది
ఈ దేశం లో ఉన్న పేదవాడి పరిస్తితి కూడా ఇలాగే ఉంది అని.
పేదవాడు ఎప్పటికి ఒకడి కింద పనిచేయవలసిందేనా...బానిసలా...
ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ఈ కోళ్ల లాగ బానిస బ్రతుకు నుండి బయట పడినా...
వాడి కాళ్ళు కట్టేసి ఉంటాయి... ఎక్కడా ఒక్క అవకాసం లేక... సహకారం అందక.. పేదవాడు ఈ సమాజంలో ఎలా బ్రతకగలడు...
ఏదో ఒక రోజు ఈ కోళ్ల లా...చావడం తప్ప.
ఒకవేళ ఆ కోళ్ళు ఆటో నుండి బయట పడక పోయినా... మరి కొద్ది సేపటి తరువాత ఆ ఆటో వాడు ఎలాగు తీసుకెళ్ళి... కోసి... అమ్మేస్తాడు...
అలాగే పేదవాడు బానిస బ్రతుకునుండి బయటపడకపోతే అక్కడే వుండి చచ్చేదాకా ఊడిగం చేయవలసిందే...
ఏంటో ఈ జీవితాలు... మరీ ఫారం కోళ్ల మాదిరి....
(కొంతమంది కాళ్ళు కట్టివేయని కోళ్ల లా స్వేచ్చగా బ్రతికేస్తారులెండి)


No comments:

Post a Comment