Dhavaleswaram Barrage |
![]() |
Prakasham Barrage |
ఈరోజు ధవళేస్వరం వంతెన మీద నుండి పడిపోయి చనిపోయిన 22 మంది కూడా మనలాగే రేపటి భవిస్యత్తు గురించి ఆలోచిస్తూ వుంటారు. కారులో ఎన్నో సరదాలు తీర్చుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, చిన్న చిన్న కోప తాపాలతో సంతోషంగా ప్రయాణిస్తూ ఉండి వుంటారు. వాళ్లకి తెలిసి చేసినా తెలియక చేసిన చిన్న పొరపాట్లే వారి ప్రాణాల్ని బలిగొని వుంటాయి. అలాగే ఈ క్షణం రోడ్ మీద కుటుంబాలతో కలిసి తిరుగుతున్న లక్షలాది వాహనాల పరిస్తితి ఏంటి. వాటన్ని టికీ భద్రత ఎక్కడ. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు.


సాధారణంగా వంతెనల మీద రోడ్స్ వేయడంలో విపరీతమైన నిర్లక్ష్యం కనపడుతుంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. జిల్లాల సరి హద్దులు, వంతెన స్తితిగతులు, రోడ్ మీద మల్లి రోడ్ వేసే పరిస్తితి లేకపోవడం ఇలా చాలా కారణాలు మనకి కనపడతాయి. అదే సమయంలో పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. కేవలం సమస్యలని చూసి అలాగే వదిలేయకుండా కనీసం ఆ దారులు మూసివేయడమైనా చేయాలి. ఏదీ కాకుండా ప్రజల ప్రాణాలను గాల్లో వదిలేయడం అనేది క్షమించరాని నేరం. కొవ్వూరు వంతెన మీద ఒకసారి ప్రయానించాను. యెంత ఘోరం అంటే దాదాపు అడుగు లోతు గుంటలు వున్నాయ్. ఆ దారిలో ప్రయాణించడం అంటే ప్రాణాలు గాల్లో వదిలేయడమే అనిపించుంది. ఇప్పుడేమన్నా బాగుపడినదో లేదో తెలీదు. విజయవాడ ప్రక్షం బారేజి పరిస్తితికూడా అలాగే వుండేది. పెద్ద పెద్ద గుంటలతో. ఈ మధ్యే కాస్త రోడ్ వేసారు. వేసిన ఆరు నెలలకే మాల్లి అక్కడక్కడ గుంటలు పడ్డాయ్. ఫుట్ పాత్ ఇప్పటికీ ప్రమాదకరంగా నే వుంది.
అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. చాలా దేశాల్లో రోడ్ కి ఏవిధమైన గుంట పడినా అధికారులు అక్కడికి 12 గంటలల్లోపు చేరుకోవాలి. 24 గంటల్లోపు అక్కడ ఆ గుంతని పూడ్చేయాలి. అలాంటి సిస్టం మనం కూడా అమలు చేయాలి.
2. లైసెన్సు జారి చేసే విధానం పూర్తిగా మారిపోవాలి. సొంత డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అందులో కొన్ని దశల్లో డ్రైవర్ యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించే పూర్తిగా శిక్షణ తీసుకున్న తరువాతే లైసెన్సు జారి చేయాలి.
3. ప్రతి 10, 15 కిలోమీటర్ కి ఒక చెక్ పాయింట్ ఏర్పాటు జరగాలి. ప్రతి వాహనం యొక్క కదలికలు వారి నేచర్ మొత్తం రికార్డెడ్ గా వుండాలి. ఇది ప్రమాదాలను నివారించడానికే కాకుండా ఇంకా అనేక విషయాల్లో ఉపయోగ పడుతుంది. ఇప్పుడు వేసే రోడ్స్ అన్ని PPP పద్దతే కనుక టెండర ఇచ్చే సమయంలోనే ఇలాంటి నిభందన అమలు చేయొచ్చు.
4. నిభందనలని పారదర్సాకంగా అమలు చేయాలి.

6. వాహనాలకి అనుమతులు ఇచ్చే సమయంలో వాటిని వివిధరకాలుగా పరీక్షించాలి. ఈ తుఫాన్ అనే వాహనాలు తరచుగా ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయి. అలాంటి వాహనాలని శాస్త్రీయంగా అద్యయనం చేసి కంపెనీలకి సూచనలు ఇచ్చి తగు మార్పులు చేయించాలి.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. తాము వాహనాన్ని నడిపేందుకు పూర్తిగా సిద్దంగా వున్నామా లేదా అని తమకి తాము పరీక్షున్చుకోవాలి.
2. ఒకవేళ డ్రైవర్ వుంటే అతని పరిస్తితిని అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి 2 గంటల ప్రయాణానికి ఒక 5, 10 నిమిషాలు గాప్ తీసుకుంటూ వెళ్ళడం మంచిది. అదికూడా ఒకరోజులో గరిష్టంగా 8 నుండి 10 గంటల ప్రయాణం మాత్రమె చేస్తే ఎటువంటి అలసటా వుండదు.
3. ముక్యంగా తెల్లవారు జాము 1 నుండి 6 గంటల మద్య వాహనాలు నడపడం మంచిది కాదు. పూర్తిగా ఈ సమయాన్ని తప్పించి డ్రైవింగ్ ప్లాన్ చేసుకోవడం మంచిది.
4. యెంత అనుభావగ్నుడైనా ఒక్కోసారి ప్రమాదం జరగోచ్చు కనుక డ్రైవింగ్ లో ఎప్పుడూ భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. ఆకతాయి తనం పనికిరాదు. మనకి ప్రమాదం జరక్క పోయినా మన ఆకతాయి తనం వాళ్ళ ఇతరులకి ప్రమాదం జరగోచ్చు.
5. నడిపే వాహనం యొక్క కండిషన్ తప్పక చెక్ చేసుకోవాలి. ముక్యంగా బ్రేక్, టైర్స్ అండ్ లైట్స్ వంటి ముక్యమైనవి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి.

7. బండికి నిర్దేశించిన వ్యక్తుల కన్నా ఎక్కువమంది బండి లో ప్రాయానిస్తే అదుపుతప్పే ప్రమాదం వుంది. కనుక ఏ ఒక్కరో అయితే పర్లేదు గాని మరీ రెట్టింపు మంది ప్రయాణించడం మానుకోవాలి. బడ్జెట్ గురించి ఆలోచిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే.
No comments:
Post a Comment