అస్సలు ఈ సంభాషణ టాప్ ద్వారా జరిగింది కాదు. ఇది స్టీఫెన్ తన మొబైల్ లో రికార్డు చేసింది కావచ్చు లేదా చంద్రబాబు PA (బాస్ మాట్లాడతారు అన్న వ్యక్తి) రికార్డు చేసింది కావచ్చు. ఎందుకంటె టాప్ చేస్తే ఫోన్ రింగ్ రికార్డు అవ్వడం జరగదు. కాబట్టి టాపింగ్ జరిగింది అని మీరు ఇప్పటికిప్పుడు నిరూపించలేరు. ఒకవేళ ఇంకేమైనా రికార్డ్స్ కెసిఆర్ బయటపెడితే తప్ప.
అలాగే ఒక ముఖ్యమంత్రి ఫోన్ టాప్ చేయడం తప్పు అనే ముందు మీరు వాళ్ళ శాసనసభ్యుడిని కొనాలని చూడడం తప్పు కాదా అని ఆలోచించండి. అలాగే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి జంప్ చేసే సమయంలో ఇచ్చే నజరానాలను దీనితో పోల్చవద్దు. ఎందుకంటె ఇది పార్టీ మారేందుకు ఇచ్చింది కాదు. ఇది వోటు వెయ్యడానికి ప్రలోభపెట్టే కేసు. కనుక మీరు మీ వాదనలన్నిటినీ పక్కన పెట్టడం మంచిది. అస్సలు ఎలెక్షన్ కమిషన్ సుమోటో గా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్ధం కాదు. ఒకవేళ కెసిఆర్ గాని లేదా స్టీఫెన్ గాని ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేస్తే మీ బతుకేమిటో ఆలోచించండి. ఇది acb కేసు మాత్రమె అయితే మీవాళ్ళు కొంత బయట పడినట్లే.
అలాగే ఇన్నాళ్ళు అవినీతి అవినీతి అని కారుకూతలు కోసిన మీ పార్టీ ముదురు నాయకులు యనమల, పరకాల ఇప్పుడు మీకు వంత పాడడం చూస్తుంటే అవినీతి, దొంగతనం హత్యా రాజకీయాలు లాంటివన్నీ చేయడానికి రాష్ట్రంలో మీ పార్టీ వాళ్లకి మాత్రమె రైట్స్ వున్నట్టు వ్యవహరించడం సిగ్గుపడాల్సిన విషయం.
అలాగే రేపు రేవంత్ అప్రూవర్ గా మారితే అతని ప్రాణానికి లేదా స్టీఫెన్ ప్రాణానికి యెంత అపాయముందో కూడా ప్రజలకి తెలుసు. ఈ మురికిని ఎదుర్కొనే సత్తా ప్రస్తుతానికి తెదేపాకి లేదు. కాని ఏమైనా జరగోచ్చు ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టే ఒక ప్రణాళిక తో ముందుకెళ్తే కెసిఆర్ కాస్త వెనకడుగు వేయొచ్చు. కాని అది ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ తాట తీసేస్తారు.

విశేషమేమంటే మీరు పాలించినా, దొంగలై దొరికినా ప్రజల ఆస్తులకే పెద్ద బొక్క. కానివ్వండి ప్రజలు ఎన్నాళ్ళో చూస్తూ ఊరుకోరు. తిరగబడే రోజు వస్తుంది.
ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా ప్రజల్లో కాస్త చైతన్యం వచ్చి ఆలోచిస్తారేమో చూడాలి. నాయకుల్లో భయం మాత్రం పెరిగింది. ఇకనైనా ఇలాంటి చర్యలు తగ్గుతాయి అని ఆశిద్దాం.
No comments:
Post a Comment