రాత్రి ఒక కల వచ్చింది. సైన్స్ ఫిక్షన్.
సూర్యుడు అంతరించిపోతున్నాడు, ఇక భూమి కూడా అంతరించిపోబోతోంది. భూమి పరిబ్రమన ఆగిపోబోతోంది, అదే జరిగితే భూమి, భూమి పైన వున్నా సమస్త జీవరాసులు క్షణాలలో నాశనం అవ్వడం ఖాయం.
ఆ కలలో నాకు తోచిన ఆలోచన ప్రత్యామ్నాయం ఒకటుంది,
భూమిని మన గాలక్సీ లోని ఇంకొక హేల్ది సూర్యుని కక్ష్యలోకి ఇప్పుడున్న దూరంలో ప్రవేశ పెట్టడం. అలా ప్రవేశ పెట్టె సమయంలో భూమి మీద వాతావరణం మారకుండా చూడడం అలాగే భూమి పరిభ్రమణ కాలం మారకుండా చూడటం చాలా ముక్యం. కాని ఎలా,
ఆలోచిస్తున్నాను...
ఇంతలో ఫోన్ మోగుతుంది మార్గదర్శి చిట్ ఏజెంట్ నుండి... నెలాఖరు కదా చిట్ డబ్బులకోసం... ఏంచేస్తాం, కల వద్దనుకొని జీవిత పోరాటం కోసం పొద్దున్నే లేవాల్సివచ్చింది...
అసలు శాస్త్ర విజ్ఞానం ఈ స్తాయిలో అభివృద్ధి చెందటం సాధ్యమేనా... ఈ భూమిమీద లేక ఈ విశ్వంలో ఎక్కడైనా ఇలా ఒక గ్రహ సోలార్ సిస్టం మార్చగలిగే టెక్నాలజీ, దానికి కావలసిన వనరులు ఉన్నాయంటారా...
ఈ క్రింది లింక్ కూడా చూడండి. మనకి తెలిసిన గెలాక్సీ ల వివరాలు ఉన్నాయి
http://en.wikipedia.org/wiki/List_of_galaxies
The Milky Way's Galactic Center in the night sky above Paranal Observatory
(the laser creates a guide-star for the telescope).
(the laser creates a guide-star for the telescope).
ఇది వికీపీడియా ఫోటో
No comments:
Post a Comment