Humanity

Humanity

Wednesday, May 27, 2015

మైల - మతం (పెద్దలకి మాత్రమె)


మైల అనగానే మనకి స్త్రీ నే గుర్తొస్తుంది. అనాదిగా మైల అనే పదాన్ని స్త్రీకే అంటగట్టాయి మన సంస్కృతులు మతాలూ. పిలుపులు వేరైనా దాదాపు అన్ని మతాలు మైలకి స్త్రీని మాత్రమె అర్హురాలిని చేసాయి.
హిందూ మతంలో అయ్యప్పమాలకి అలాగే కొన్ని కార్యాలకి దూరంగా ఉంచుతారు. అలాగే ముస్లిమ్స్ లో ఏకంగా మసీదులోకి స్త్రీ అడుగు పెట్టకుండా ఉండడానికి కారణంగా ఈ మైలనే ప్రధానంగా చెప్తారు.
రుతుక్రమంలో ఉన్న స్త్రీని ఆ మూడు లేక ఐదు రోజులు దూరంగా వుంచడం మతాలూ చేస్తున్నాయి. కొన్ని మతాలలో ఈ మైల వల్లే స్త్రీ చాలా వాటికి దూరంగా ఒక వివక్షని ఎదుర్కొంటుంది. స్త్రీకి ఆ సమయంలో విశ్రాంతి అవసరమే. అలా అని ఆ రుతుక్రమం వల్ల దేవుడికి అపచారం జరుగుతుంది అని, మనుషులకి రోగాలు వస్తాయి అని ఇంకా నమ్మడం మూర్కత్వం. 
స్త్రీని తాకకుండా, దూరంగా వెలివేయడం అన్నది తనపైన వత్తిడిని పెంచి ఇంకా ఆందోళనకి గురిచేసేది తప్ప తనకి స్వాంతన నిచ్చేది కాదు. పరిణామక్రమంలో గతంలో స్త్రీకి రుతుక్రమంలో లేని ఇబ్బందులు నేడు ఎక్కువగా ఉండడానికి ఈ మతాలూ అనుసరించే విధానాల వల్ల కలిగే వత్తిడి కూడా కారణమే.
మానవ పరిణామంలో పునరుత్పత్తికి ముక్యమైనది స్త్రీ యొక్క రుతుక్రమం. ఈ మైల అనేది స్త్రీకి లేకపోతె ఈ సృష్టిలో మానవుడి పునరుత్పత్తి సాద్యంకాదు. రుతుక్రమం అనేది లేకపోతె స్త్రీ గర్భదారణ సాద్యం కాదు. ఒక మగాడ్ని కనాలన్నా లేక స్త్రీని కనాలన్నా ఇప్పటి పరిణామాన్ని బట్టి స్త్రీకి రుతుక్రమం చాలా ముక్యం. అలాంటి ఒక మంచి పని స్త్రీ వల్ల, రుతుక్రమం వల్ల జరుగుతుంటే మగాడు మాత్రం తనకి నచ్చిన రీతిలో తనకి అవసరమైన రీతిలో అన్వయించుకొని తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి చత్త సాప్రదాయాలను మతాల ముసుగులో భయపెడుతూ తమకి తామే ఏదో అపచారం చేసినట్టు వేలివేసుకోనేలా ఈ మతాలూ స్త్రీలని భయపెట్టాయి.
అసలు ఒక స్త్రీ మైలలో నుండి పుట్టిన బిడ్డకి అంటని మైల స్త్రీకి మాత్రమె ఎలా వుంటుంది. ఒక స్త్రీ మైలపడింది అనాలి అంటే అంతకన్నా ముందే ఈ సృష్టిలోని ప్రతి మనిషి మైల పడే వున్నాడు అని ఒప్పుకోవాలి. అలాంటప్పుడు స్త్రీని మైల పేరుతొ అణచాలి అని చూస్తున్న ఈ మత విశ్వాసాలని నిర్భయంగా ఎదుర్కోక తప్పదు.
ఒకనాడు మైల వల్ల రోగాలు వస్తాయి అని భయపడి ఉండవచ్చు. లేదా వచ్చి కూడా ఉండవచ్చు. కాని నేడు ఆ పరిస్తితి లేదు. స్త్రీ అన్ని పనులు ఆ ఐదు రోజులు కూడా చేసుకోగలుగుతుంది. ఉద్యోగం చేస్తుంది, వ్యాపరం చేస్తుంది, బడికెలుతుంది, ఆటలాడుకుంటుంది అలాగే అన్ని చేస్తుంది. దానికి తగిన మందులు అలాగే కొన్ని సౌకర్యాలు వచ్చాయి. కాని నేటికీ వివక్ష మాత్రం పోవడం లేదు.
ఒక స్త్రీకి మీరనే మైల.... ఈ స్తుష్టి కారకం. అంటే అది మీ పవిత్ర గ్రందాలకన్నా పవిత్రమైనదిగా చూడాల్సిన మతాలు కేవలం స్త్రీ కి మాత్రమె రావడం చేతనే మైల గా చేసేసారు.
ఓ పరిణామక్రమమా ఈ మైలని మగాళ్ళకి కూడా ఇవ్వాల్సింది. 
తప్పు చేసావ్...

2 comments: