Humanity

Humanity

Friday, January 29, 2016

జర్నలిజం - Prestitutes ఎవరు ???

ఇది కోరడా. కామ్ లో వచ్చిన ఆర్టికల్ లో ఇచ్చిన ఇమేజ్
గత కొంతకాలంగా కొరడా.com న్యూస్ చూస్తున్నాను. చాలావరకు వారి పాయింట్ అఫ్ వ్యూ అర్ధం అయినా కూడా ఇప్పటిదాకా న్యూట్రల్  గానే కనిపించేలా రాసారు. కాని నిన్న పోస్ట్ చేసిన ఒక ఆర్టికల్ " మీడియా  వ్యబిచారులారా  కళ్ళు తెరవండి ... బుర్రలో గుజ్జు పెంచుకోండి" అనేది మాత్రం చాలా అబ్యంతరకరంగా వుంది. ఎందుకంటె కొంతమంది జర్నలిస్ట్  లని టార్గెట్ చేస్తూ వ్యబిచారులు అనడం చాలా అభ్యంతరకరం. ఇక పొతే వాళ్ళు హార్డ్ కోర్  లెఫ్టిస్ట్ జర్నలిస్ట్ లు అని వ్రాయడం. ఇదంతా ఒక ఎట్టు అయితే నరేంద్రమోడి ప్రభుత్వం చేస్తున్న మంచిపనులని చర్చిన్చాడంలేదు అని వారి వెబ్సైటు  లో రాసారు. 

సాధారణంగా మీడియా ప్రభుత్వాల చెడునే చూపించాలి ఎందుకంటె మీడియా ఎప్పుడూ  ప్రభుత్వానికి ప్రతిపక్షంగానే వ్యవహరించి ప్రజల పక్షాన నిలవాలి. అదే వాళ్ళు చేస్తుంది కూడా. కాని తమ అనుకూల ప్రభుత్వం వచ్చింది అని ఆ ప్రభుత్వం ఏం చేసినా నెత్తిన పెట్టుకొనే కోరడ లాంటి వెబ్సైటు నిర్వాహకులు ప్రజలకి చేర్చేవి ప్రభుత్వ అనుకూల వార్తలే తప్ప ప్రభుత్వ మోసాలు చేసే కుట్రలు వాళ్లకి కనపడవు. అందుకే చాలా రోజుల తర్వాత ఇది రాస్తున్నా. 

ఆ వెబ్సైటు  లో వాళ్ళు చెప్పినదాని ప్రకారం పాయింట్ వారిగా ప్రభుత్వం చేస్తున్న పనులకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 

కొరడా : రోహిత్ మరణం వల్ల దేసానికేదో ప్రమాదం వచ్చినట్టు మీడియా ప్రచారం చేసింది.
A . మత తత్వ ప్రమాదం మెడ మీద కత్తిలా వేలాడుతుంటే మీలాంటి నిక్కర్ బాచ్ సపోర్టర్ కి సంతోషంగానే ఉండొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది వుండదు. కాని ఈ దేశానికి వాటిల్లబోతున్న ప్రమాదాన్ని తెలుసుకోవడం తప్పా, దాన్ని ప్రజలకి తెలియ చేయడం వ్యబిచారం అవుతుందా???

పైన చెప్పిన మీడియా వాళ్ళు మర్చిపోయారు అని కొరడా. కామ్ చెప్తున్న అంశం స్క్రీన్ షాట్ 1
1. జన ధన యోజన... 

ప్రధానంగా జీరో బాలన్సు ఎకౌంటు ఓపెన్ చేస్తే ఈ స్కీం క్రింద చెప్పిన మూడు అంశాలు:
A. ప్రమాద భీమా ఒక లక్ష
B. ప్రమాద భీమా 30 వేలు
C. 5,000 వేలు ఓవర్ డ్రాఫ్ట్.
వీటిలో జరిగిన మర్మం ఏంటో చూద్దాం
A. ప్రమాద భీమా HDFC ERGo కంపనీ ఇస్తుంది. దానికి కావలసిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇంతవరకు బానేవుంది. కాని లెక్కలు చూస్తె మనకి కళ్ళు తిరుగుతాయి. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ కి యెంత ప్రీమియం చేల్లిస్తుందో మనకి చెప్పరు. అలాగే దాదాపు రెండున్నర కోట్లమంది ప్రజలని ప్రవేటు ఇన్సురెన్సె  సంస్తకి కాతాదారులని చేసారు. సరే ఒప్పుకుందాం ప్రజలకోసమే అనుకుందాం. కాని ఇందులో కూడా ఇంకో చిక్కు వుంది. ఒక వ్యక్తీ ప్రమాదంలో చనిపోయిన తర్వాత క్లెయిమ్ రావాలంటే ఆ వ్యక్తీ తనకి ఇచ్చిన రూపీ కార్డు ని 45 రోజుల ముందు కనీసం ఒక్కసారైనా వుపయోగించి వుండాలి. సరే ఒప్పుకుందాం ఇది కూడా మంచిదే అని. కాని ఇది ప్రమాద భీమా కదా! అంటే 2013 WHO లెక్కల ప్రకారం మన దేశంలో ఏడాదికి లక్షమందిలో 16.6 మంది చనిపోతున్నారు. అంటే ఒక కోటిమందికి 1600 వందలమంది అన్నమాట. ఇదులొకోదా ఇంకో మర్మం వుంది. అస్సలు ఈ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు దాదాపు గ్రామీణులు. అంటే ఏడాదిలో  వాళ్ళు ఒక్కసారికూడా ప్రయాణం చేయని వాళ్ళు వుంటారు. అలాగే సొంత వాహనాలు లేని వాళ్ళు ఎక్కువమంది వుంటారు. ఇలాంటి లెక్కలన్నీ వేసే ప్రమాద భీమా అనేది ఇస్తారు. అది కూడా నష్టం రావడం అనేది ఇన్నేళ్ళ ఇన్సురెన్సె చరిత్రలో జరగలేదు. ఇందుకు LIC  నే ప్రత్యక్ష ఉదాహరణ. కనుక ఈ ఇన్సురెన్సె ఎలా ఇస్తారో ఎందుకు ఇస్తారో ప్రభుత్వం అందుకు ఎలా సిద్ద పడిందో అందులో ప్రజాధనం యెంత వేచ్చిన్చారో బయటకి చెప్పారు. సరే వదిలేద్దాం ఇది చిన్నమొత్తమే అని, కాని ప్రతి ఎకౌంటు కి 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదు. 2014 జనవరి లో అకౌంట్స్ ఓపెన్ చేసిన వారికి 6నెలల తర్వాత 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా. 

పైగా 30 వేల కోట్లు ఈ ఖాతాల్లో జమ అయ్యాయని దాని వాళ్ళ దేశ ఆర్ధిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్త పరిపుష్టం అవుతుందని రాసారు. ఇవి వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ లో దాచుకున్న సొమ్మా లేక ప్రభుత్వానికి ఇచ్చిన డబ్బా. లేదా వాళ్ళేమైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసారా. సరే అవుతుందే అనుకుందాం కాని ఈ సొమ్ము వాళ్ళు వేరే ఖాతాలనుండి బదిలీ చేయలేదు అని నమ్మొచ్చా. లేక మల్లి వాళ్ళ అవసరాలకి తీసుకోరు అనుకోవాలా ?

అంటే ఒక మీడియా పర్సన్ ప్రభుత్వం ఇచ్చిన 5 వేల ఓవర్ డ్రాఫ్ట్  హామీ మీద నిలదీయాలా లేక 2కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేసారు అని సంబర పడుతూ ఆర్టికల్స్ రాయాలా! అది కోరడా  వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. 

స్క్రీన్ షాట్ 2
2. ఫ్రీ వైఫే...   
ఇదొక మాయాజాలం... 
ఈ సేర్విస్ గూగుల్ మాత్రమె ఎండుకిస్తుందో అర్ధం చేసుకోలేనంత అమాయకులెం కాదు అని తెలుసు. కాని ఎందుకో చాలా విషయాలు కావాలని మర్చిపోతారు. ఫ్రీ గా వస్తుందని కొన్నిరోజులు వాడతారు. అలా వాళ్ళు వాడడం వాళ్ళ కూడా గూగుల్ కి రెవిన్యూ వస్తుందని మర్చిపోకూడదు. తమ వెబ్సైటు ద్వారా ఆడ్స్  ని చూపిస్తున్న కొరడా  కి ఇది తెలియదు అనుకుంటే తప్పే. పైగా ఈ సేర్విస్ కొన్ని రోజుల తర్వాత లేదా నెలల తర్వాత లిమిటెడ్ టైం మాత్రమె ఇస్తారు. ఆ తర్వాత వాడాలంటే డబ్బులు కట్టాల్సి వస్తుంది. ప్రజల్ని ఫ్రీ ఫ్రీ అని చెప్పి మోసం చేసే ఇలాంటి పదకాలని వ్యతిరేకంగా రాయనందుకు సంతోష పడండి. 

స్క్రీన్ షాట్ 3
3. విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు డబుల్ అయ్యాయా లేక 40% పెరిగాయా? సరే డబుల్ అయ్యాయనే అనుకుందాం. కాని ఎలా పెట్టుబడి పెట్టారు. ఎందుకు పెట్టారు. అంతర్జాతీయంగా ఎక్కడ చూసినా లాభాలకోసం తప్ప సేవ కోసం ఎవడూ పెట్టుబడి పెట్టాడు అని మీకు తెలియనిది కాదు కదా. 2006 వచ్చిన సంక్షోబానికి ఈ దేశ ఆర్ధిక వ్యవస్త మీద అంతగా ప్రభావం చూపలేదు అంటే ఈ ఫది ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండబట్టే. కాని గేట్లు బార్లా తెరిచారు. ఒకపక్క ఉగ్రవాదుల డబ్బు కూడా వచ్చి చేరుతుంది అనే అనుమానాలు వున్నాయి. అలాగే రేపు ఏదైనా సంక్షోబం వస్తే ఈ దెస ఆర్ధిక వ్యవస్త కూడా చిన్న భిన్నం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి తప్ప మనం ఎప్పటిలాగే సేఫ్ సైడ్ ఉండగలమా అనే అనుమానాల మద్య ఇలాంటివాటిని సిగ్గు విడిచి ఎలా ప్రమోట్  చేస్తారు. కాస్త ఈ దేశ మూల ఆర్ధిక వ్యవస్తని కాస్త అర్ధం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని మార్కెట్ లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడే విదేశీ ఇన్వెస్టర్స్  మూలంగా పెరిగినట్టే పెరిగి లాభాలు రాగానే ముంచేసి పోతారనే కనీస అవగాహన ఉండాలికదా. లేక వాళ్ళేమైనా ప్రత్యక్షంగా ఒక కంపెనీ పెట్టి ఒక వెయ్యిమందికి ఉపాది కల్పిస్తుంటే చెప్పండి. 


స్క్రీన్ షాట్ 4
4. చైనా ఆర్ధిక మాద్యంతో అల్లాడుతుంటే ఇప్పుడు దానితో పోటి పెట్టి మన జీడీపీ ని గొప్పగా చూపించే ప్రయత్నం మహా బాగా చేసారు. ఇక్కడ వాస్తవాలను కూడా కొంచం చూడండి. 1.2 శాతానికి తగ్గించడం ఒక ప్రధాన కారణమే. కాని అది మీ ప్రభుత్వ గొప్పతనం అని చెప్పుకోవడం మరీ విడ్డూరం. సరే అదీ ఒప్పుకుందాం గతంలో కూడా ఇంతకన్నా ఎక్కువ జీడీపీ నే నమోదయ్యిందని ఎలా మర్చిపోతున్నారు. ఇదిగో ఇక్కడ ఇచ్చిన చార్ట్ లో 2004 నుండి నమోదైన జీడీపీ ఇస్తున్నాం చూడండి. ఇంకా మీకమైన గొప్పలు చెప్పాలనిపిస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా... 
లేదు ఇదంతా ఒత్తి తప్పుడు లెక్కలు అంటారా చెప్పండి. మీ లెక్కలు యెంత నిజాలో కూడా మేము తెలుసుకుంటాం.... 

5. నాకు ఇంకా నమ్మబుద్ది కావట్ల ఇండియా లో 18,000 గ్రామాలు ఇంకా కరెంటు లేకుండా ఉన్నాయా అని. సరే ఒక్క గ్రామన్నన్నా వెళ్లి చూద్దాం అని అనుకున్నా. కాని ఆంధ్ర ప్రదేశ లో గాని తెలంగాణలో గాని ఒక్క గ్రామం కూడా లేదని చూపిస్తున్నారు. అలాగే అతి తక్కువగా వెస్ట్ బెంగాల్ 22 గ్రామాలు, త్రిపుర 26 గ్రామాలు వున్నాయి. అత్యదికంగా ఒరిస్సా, అస్సాం, బీహార్ లో వున్నాయి. ఈ లెక్కలు పూర్తిగా తెలుసుకోలేకుండా వున్నాయి. పోనీ వెస్ట్ బెంగాల్ లో 8 గ్రామాలకి ఆల్రెడీ పవర్ ఇచ్చామని వెబ్సైటు లో వుంది. అవి ఏ గ్రామాలో ఇవ్వలేదు. కనుక నేనైతే తెలుసుకోలేను. అవి గ్రామాలా లేక కుగ్రామాలా, లేక అవి యెంత చిన్నవో యెంత జనాభా వున్నారో తెలీదు. ఏదేమైనా ఇవ్వడం మంచిదే గాని లెక్కల్లో ట్రాన్స్పరెన్సీ వుంటే ఇంకా మంచిది. నాబోటి వాళ్లకి కూడా అర్ధం అయ్యేలా...వెబ్సైటు: http://103.233.79.65/dashboard#77

స్క్రీన్ షాట్ 5
6. స్టార్ట్ అప్స్, ఇది మంచి పనే. కాదని ఎవరూ అనట్లేదు. ప్రభుత్వమే స్టార్ట్ అప్స్ కి ఇన్వెస్ట్ చేయడం మంచిదే కాని అవి అమల్లోకి వచ్చాక ఏ ప్రాజెక్ట్స్ కి యెంత ఇచ్చారు, ఆ నిధులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా చూడాలి కదా. వెయ్యి కోట్లు ఇస్తున్నాం అనగానే పని అవ్వడుకదా. ఆ వెయ్యి కోట్ల వల్ల ఎన్ని కంపెనీలు వచ్చాయి, అవి ఏ స్తాయిలో అభివృద్ధి చెందుతున్నాయి అనేది కూడా చూడాలి. ఇక పొతే ఇలాంటి ఒక ప్రయత్నం చేయడం చాలా మంచిదే. దీన్ని ఏ పత్రికలో రాయలేదు అనుకుంటే ఎలా. చివరికి కమ్యూనిస్ట్ పార్టీలైన ప్రజాశక్తి విశాలాన్ద్రల్లో  కూడా వచ్చిందని చెప్పదలచుకున్నాను. కావాలంటే ఒకసారి చూడండి. 
మీరు చెప్పిన చానల్స్ లో వచ్చిన ఆర్టికల్స్. NDTV : http://www.ndtv.com/cheat-sheet/startup-india-pm-modis-action-plan-in-10-points-1266648
ఆజ్  తక్ : http://aajtak.intoday.in/story/key-points-by-pm-modi-for-startup-india-1-850681.html
IBN : http://www.ibnlive.com/news/business/emerging-enterprises-hail-pm-modis-startup-india-action-plan-1191307.html
ఇండియా టుడే: http://indiatoday.intoday.in/story/startup-india-19-key-points-of-pm-modis-action-plan/1/572651.html
మరి వీటిని కవేరేజ్ అంటారో లేక ఇంకేమంటారో తెలీడంలేదు. కావాలని ఉద్దేస పూర్వకంగా వ్యబిచారులు అని తిట్టడం వెనక ఉద్దేశం ఏంటో మీకు అర్ధం అయితే చాలు. అసలు వ్యబిచారం చేస్తుంది ఎవరో కూడా గమనించండి. 

స్క్రీన్ షాట్ 6
7. ఇక ఈ ఒక్క పాయింట్ తో అర్ధం అవుతుంది ఈ  సైట్ వెబ్సైటు నిజాయితీ. ఇదంతా భజపా భజనకోసమే అని స్పష్టంగా అర్ధం అయ్యేలా వుంది.  

అవును ప్రజల స్తలాలు తీసుకొని వాళ్లకి డబ్బులు సక్రమంగా ఇవ్వడం కూడా ఒక పెద్ద అచేవేమేంట్ అని మనం భావించే స్తితిలో వున్నందుకు మనం సిగ్గుపడాలి. అలాగే ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా చాలా జరిగాయి. ప్రభుత్వానికి ఖచ్చితంగా అవసరమైన విషయాల్లో ఎంతో ఉదారంగా వుండడం  చూస్తూనే వుంటాం. అన్ని విషయాల్లో వాళ్ళు అలాగే వుండరు. వుంటే మంచిదే. కాని అదేమంత గొప్ప విషయంగా చూడాల్సిన పనిలేదు. ఎందుకంటె స్తలాలు తీసుకొన్నప్పుడు డబ్బులు సక్రమంగా ఇవ్వడం ప్రబుత్వ భాద్యత కదా.... 

చివరిగా  ఒక్క మాట.... 
అస్సలు ఇంతకీ ఈ వెబ్సైటు లో కొంతమందిని వ్యబిచారులుగా చిత్రించే పని పూనుకోవడం దేనికి అని ఆలోచిస్తే వాళ్ళు భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా రాయట్లేదు. అలాగే అవి చేసే చిన్న చిన్న పనులని కూడా గొప్పగా కీర్తించే పని చెయ్యట్లేదు అని అక్కసు. సరే వేల్లగాక్కొచ్చు గాక. కాని మరీ ఇంత దిగజారి వ్యబిచారులు అనడం అంటే మీ దిగజారుడు తనానికి పరాకాష్ట. రెండు వ్యతిరేక శక్తులు లేదా రెండు పార్టీలు వున్నప్పుడు విరుద్ద భావాలు వున్నప్పుడు సహజంగా ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకోవడం మామూలే. కాని ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజల పక్షాన ప్రభుత్వాలని ప్రశ్నిస్తాం అని చెప్పుకొనే జర్నలిస్ట్లు ఆ పని చేయకపోగా ప్రభుత్వాలకి అలాగే తమ ఆలోచనలు కలిగిన మత శక్తులకి అడ్డగోలుగా ప్రచారం చేయడానికి ఆ విలువల్ని పాటించే వాళ్ళని వ్యబిచారులు అంటూ ఆర్టికల్స్ రాయడం. 

(వీళ్ళకి నాకు ఎరువంటి పరిచయం లేదు. అలాగే కొరడా మీద ప్రత్యెక వ్యతిరేకతా అభిమానం కూడా ఏమీ లేవు)

Tuesday, June 16, 2015

వివేక్ - నక్సలిజం


వివేక్ 19 ఏళ్ళ కుర్రాడు ఎన్కౌంటర్ లో చనిపోయిన దగ్గరనుండి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా మంది పోస్ట్లు వస్తూనే వున్నాయ్. వీటన్నిటిని చూసిన తర్వాత రాయాలి అనిపించి రాస్తున్నా.
వివేక్ నిజంగా ఒక పోరాట యోధుడు. అందులో సందేహం లేదు. తాను నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలైనా అర్పించే తత్వం ఉన్న గొప్పవ్యక్తి. డబ్బుకోసం ఏ ఎండకి ఆ గోడుగు పట్టే నేటి ఆధునిక సమాజంలో పుట్టి ఇతరులకోసం ప్రాణాలను సైతం లెక్క చేయని త్యాగ జీవి. అదే సందర్భంలో ఎంతో మందిని రిక్రూట్ చేసుకుంటున్నా ఈ వివేక్ మాత్రమె ఎలా పోలీసులకి దొరికి ఎన్కౌంటర్ లో చనిపోయాడు అనే విషయంలో అతని కేడెర్ యొక్క అసమర్ధత కనిపిస్తుంది. ఇది కావాలనే ఎవరో చేసిన పనిగా అనుమానించాల్సి వస్తుంది. ఇన్నాళ్ళుగా ఇన్ని కుమ్బింగ్స్ లో దొరకని ఎంతోమంది వున్నారు. కాని ఇతను మాత్రం ఒక్కడే ఎలా దొరికాడు. నిజాలు నిదానంగా తెలుస్తాయి.

తుపాకి ఎందుకు పట్టాలి? 

ఒక వ్యక్తీ మనల్ని రాయితో కొడుతుంటే మనం రాయితో కొడతాం, కర్రపట్టుకొని వస్తే మనం కూడా కర్రపట్టుకుంటాం అలాగే తుపాకి పట్టుకొని వస్తే తుపాకి పట్టుకోవాలి. తప్పదు. ఎందుకంటె ఇది బతుకు పోరాటం. అహింసా సిద్దాంతం అన్నివేళలా పనిచేయదు. అహింసా సిద్దాంతం గాంధీగారు చేయడానికి అప్పటి రాజకీయ పరిస్తితులు అనుకూలించాయి. ప్రపంచంలో బ్రిటిషర్స్ కి రాజకీయంగా వ్యతిరేకత కలిగే అవకాసం వుంటుంది. అంతర్జాతీయ పరిస్తితులు అనుకూలించాయి. అందుకే అహింస అని తల వంచినా ఏమీ చేయలేకపోయారు బ్రిటిషర్స్. కాని స్వాతంత్ర్యం వచ్చాక మనదేశ అంతర్గత పరిస్తితులు అలా లేవు. నాటి భూస్వాములు లేదా నవాబులు పరిపాలన అత్యంత దౌర్జన్యంగా, అరాచకంగా వుండేది. అహింసా అంటే హింసని చూపించే పరిస్తితి. విసిగి వేసారిన ప్రజలు తిరగబడ్డారు. భూస్వామ్య వ్యవస్త మీద అతి సాధారణ ప్రజలు తుపాకి పట్టి తెలంగాణా సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య వ్యవస్థ మీద పోరాడి ఆ వ్యవస్తనే లేకుండా చేయగలిగారు. ఆ స్పూర్తి ప్రజలలో ఇప్పటికీ చాటుకుంటూనే వున్నారు. తెలంగాణా అనే పదం సాయుధపోరాటం ద్వారా చిరకాలం ఈ ప్రపంచానికే గుర్తుండి పోతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ సాయుధపోరాట స్పూర్తి తెలంగాణాని విడిగానే చూసింది. నేటికి అది తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఒక రాష్ట్రంగా ఏర్పడింది.
అహింసా సిద్దాంతం మంచిదే అయితే పాకిస్తాన్ సైనికులముందు మనవాళ్ళని తుపాకి లేకుండా పంపగాలమా. హింసని కోరుకొనే వాళ్ళతో అహింస ద్వారా విజయం సాధించలేం. ఇలా అహింసా అనాలి అంటే శత్రువు కూడా మంచివాడై వుండాలి. కాని ఇక్కడి వ్యవస్త మంచిదేనా. ఎన్నో ఏళ్ళుగా తమ తమ ప్రాంతాల్లో హాయిగా జీవనం సాగిస్తున్న ప్రజలను ఏదోఒక ఖనిజం పేరుతోనో, భూమికోసమో, ప్రాజెక్ట్ కోసమో తమ భూభాగాన్ని వదిలి పొమ్మని తుపాకి పట్టుకొని బెదిరిస్తుంటే, చంపుతుంటే ఎవరైనా ఏంచేస్తారు. తల వంచుకొని ఎంతదూరం పోతారు. కనీసం ఉపాది అవకాశాలు చూపకుండా పునరావాసం చూపించకుండా రాజ్యం చేస్తున్న హింస ఇక్కడ ఎవడికి కనబడుతుంది. ఎవడు రాస్తాడు పేపర్లలో. ఎవడు వేస్తాడు టీవీల్లో. ఎవడు ఆడ్స్ ఇచ్ఛి డబ్బులిస్తే వాడి డబ్బా కొట్టడం తప్ప. తుపాకితో పనిలేకుండా పనిజరుగుతుంటే తుపాకి ఎందుకు పడతారు. నిజంగా ప్రజల శ్రేయస్సుకోసం కాదా ఈ ప్రభుత్వాలు వున్నది. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రజల శ్రేయస్సు కోరే వాళ్ళని తుపాకి పట్టుకోనేదాకా తీసుకెళ్లడం. ఇది రాజ్యం, ప్రభుత్వాల వైఫల్యం.
ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న చర్చ మరొక ఎత్తు. నాయకుల పిల్లలని ఎందుకు బలివ్వరు అని. వాళ్ళ పిల్లలని మాత్రం విదేశాల్లో చదివిస్తున్నారు అని ఇలా రకరకాల చర్చలు వస్తున్నాయ్. ఇందులో నిజాలు లేకపోలేదు. కాని పూర్తిగా ఇక్కడి రాజకీయ వ్యవస్తలో బ్రస్తుపట్టిపోయిన ప్రజలు ఇది మాట్లాడడం విడ్డూరం. వీళ్ళకి కనీస అర్హత కూడా లేదు.
ఏదేమైనా నాటి నక్సలిజం వేరు నేటి ఇజం వేరు. ఆరోజుల్లో ప్రజల్లో సానుభూతి మెండుగా వుండేది. నేడు అది లేదు. పూర్తిగా తగ్గిపోయింది. కేవలం ఆ సానుభూతి కొన్ని చిట్ట చివరి పీడిత ప్రజలలోనే కనిపిస్తుంది. దానికి కారణం కూడా నక్సల్స్ అవలంబిస్తున్న విధానాలే.
రాజులు సైన్యాన్ని ముందుపెట్టి యుద్ధం చేసినట్టు నేడు పాలకులు కూడా పోలీసులని ముందుపెట్టి వాళ్ళని బలిచేస్తున్నారు. ఇది వ్యవస్తలో తప్పుకాకపోయిన నక్సల్స్ మాత్రం ఆ సైన్యం వెనకపడుతూ ప్రజలను హింసిస్తున్న పాలకులని మాత్రం వదిలేస్తూ ప్రజల్లో సానుభూతిని కోల్పోతున్నారు. 20 ఏళ్ళ క్రితం ఏ నాయకుడు తప్పు చేయాలన్నా అన్నలు వున్నారు చంపేస్తారు అనే భయం వుండేది. కాని నేడు అది లేదు పైగా వాళ్ళతోనే లాలూచి పడే స్తాయికి దిగజారి పోయి తమ సిద్దాంతాన్ని వదిలేసి తమ ఉనికిని కోల్పోతున్నారు.
ఇటువంటి సందర్భంలో ఇలా ఒక చదువుకున్న వ్యక్తి, యువకుడు ఈ అన్నలకి చేరువవ్వడం వింత కాకపోయినా తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఇది పూర్తిగా అతని వ్యక్తిగతమే అయినా తను ఎంచుకున్న మార్గం మాత్రం ప్రజలకోసమే అని మనం నమ్మాలి. నేడు ఈ వ్యవస్తలో ఉన్న అనేకానేక రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు చేయలేని సాహసం, తెగువ చూపి ప్రజలకోసం చివరికి ప్రాణాలు అర్పించాడు.
ఇప్పుడున్న నాయలుకుల పిల్లలు ఎందుకు చేయరు అనేది పూర్తిగా అసంబద్దమైన వాదన. ఎందుకంటె ఒక సిద్దాంతానికి కట్టుబడడం, ఫాలో అవ్వడం అనేది ఆ వ్యక్తీ యొక్క సొంత నిర్ణయం. అది పూర్తిగా వ్యక్తిగతం. ఈ ప్రపంచంలో ఉన్న అనేకానేక రుగ్మతలు నిత్యం ప్రజలని తప్పుదారి పట్టిస్తుంటాయి. యెంత కాదన్నా నేడు ఇలా ప్రాణాలు అర్పించేవారి మూలాలు తమ తమ పూర్వికులనుండి పొందిన స్పూర్తి చాలా వుంటుంది. అంటే నేడు ఉన్న కమ్యునిస్ట్ ల కుటుంబాల లో నుండే ఎక్కువగా రేపటి తరం వస్తుంది. కొత్తగా వచ్చి సిద్దాంతాన్ని అర్ధంచేసుకొనే వాళ్ళ కన్నా ఇలా తరాలుగా కమ్యునిస్ట్ కుటుంబాలలోనుండి వచ్చేవాల్లె ఎక్కువ వుంటారు. ఆ విషయాన్ని మరిచి కేవలం కొంతమంది అగ్ర నాయకుల పిల్లలు ఎందుకు రారు అనే ప్రశ్న వేస్తె మీకు ఈ సిద్దాంతం మీద అవగాహన రాహిత్యాన్ని మాత్రమె తెలియజేస్తుంది. ఇక్కడ పూర్తిగా వ్యక్తిగత స్వేఛ్చ వుంటుంది. ఈ దారిలో వుండే ముళ్ళని వివేక్ కి కూడా తల్లిదండ్రులో లేదా పరిచయం వున్నా నాయకులో చెప్పే వుంటారు. దానికి సిద్దపడి వచ్చినవాళ్ళే వస్తారు. బలవంతంగా వుంచడం, చేర్పించుకోవడం ఇక్కడ జరగదు, సాద్యం కూడా కాదు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటె ఎంతోమంది లొంగిపోయిన వ్యక్తులు నేడు స్వేచ్చగా ఉండడానికి కారణం కూడా ఎవరి బలవంతం లేకపోవడమే.
ప్రజల బాగుకోసం ఏర్పడే ప్రభుత్వాలు అవి చేయనప్పుడు, వాటిని చూస్తూ ప్రజలు ఊరుకుంటుంటే ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ప్రజలకోసం ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్దపడే ఇలాంటి వివేక్ లు పుట్టుకొస్తూనే వుంటారు.
అతడిని గొప్పవాడిగా చూడకపోయినా పర్లేదు - విమర్శించే హక్కు ఇక్కడ ఎవ్వడికీ లేదు... నిజంగా ఎవ్వడికీ లేదు. ఒకవేళ మీకు వుంటే అందుకు తగిన ఆధారాలతో కామెంట్ చేయండి.

Saturday, June 13, 2015

వంతెనలు - రోడ్డు ప్రమాదాలు


Dhavaleswaram Barrage 
Prakasham Barrage
ఇంత ఆధునిక సమాజం లో బతుకుతున్నా ఇంకా రోడ్ ప్రమాదాల్లో ప్రాణాలను పోగొట్టుకోవడం చాలా విచారకరం. అందులోను ఇలాంటి ఘోర దుర్గటనలు అందర్నీ కలచివేస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. మనం చిన్న విషయాలే వదిలేసేవి ఒక్కోసారి ఘోర ప్రమాదాలకి కారణాలు అవుతాయి.
ఈరోజు ధవళేస్వరం వంతెన మీద నుండి పడిపోయి చనిపోయిన 22 మంది కూడా మనలాగే రేపటి భవిస్యత్తు గురించి ఆలోచిస్తూ వుంటారు. కారులో ఎన్నో సరదాలు తీర్చుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, చిన్న చిన్న కోప తాపాలతో సంతోషంగా ప్రయాణిస్తూ ఉండి వుంటారు. వాళ్లకి తెలిసి చేసినా తెలియక చేసిన చిన్న పొరపాట్లే వారి ప్రాణాల్ని బలిగొని వుంటాయి.  అలాగే ఈ క్షణం రోడ్ మీద కుటుంబాలతో కలిసి తిరుగుతున్న లక్షలాది వాహనాల పరిస్తితి ఏంటి. వాటన్ని టికీ భద్రత ఎక్కడ. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు.


అపరిచితుడు సినిమాలో చెప్పినట్టు ప్రతి చోటా నిర్లక్ష్యం. రోడ్ వేయడంలో నిర్లక్షం, గుంటలు పడితే పూడ్చడంలో నిర్లక్ష్యం, సరైన సూచనలు చేసే బోర్డ్ లు అమర్చడంలో నిర్లక్ష్యం. డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడంలో నిర్లక్ష్యం. ఇచ్చినవాడు తాగి నడుపుతున్నాడో లేదో తెలుసుకోడంలో నిర్లక్ష్యం.  అంతా లంచాల మాయం. వ్యవస్తలు అన్నీ సక్రమంగా పనిచేస్తే ఇంతటి ఘోరాలు జరగవు అనేది సత్యం.

సాధారణంగా వంతెనల మీద రోడ్స్ వేయడంలో విపరీతమైన నిర్లక్ష్యం కనపడుతుంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. జిల్లాల సరి హద్దులు, వంతెన స్తితిగతులు, రోడ్ మీద మల్లి రోడ్ వేసే పరిస్తితి లేకపోవడం ఇలా చాలా కారణాలు మనకి కనపడతాయి. అదే సమయంలో పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. కేవలం సమస్యలని చూసి అలాగే వదిలేయకుండా కనీసం ఆ దారులు మూసివేయడమైనా చేయాలి. ఏదీ కాకుండా ప్రజల ప్రాణాలను గాల్లో వదిలేయడం అనేది క్షమించరాని నేరం. కొవ్వూరు వంతెన మీద ఒకసారి ప్రయానించాను. యెంత ఘోరం అంటే దాదాపు అడుగు లోతు గుంటలు వున్నాయ్. ఆ దారిలో ప్రయాణించడం అంటే ప్రాణాలు గాల్లో వదిలేయడమే అనిపించుంది. ఇప్పుడేమన్నా బాగుపడినదో లేదో తెలీదు. విజయవాడ ప్రక్షం బారేజి పరిస్తితికూడా అలాగే వుండేది. పెద్ద పెద్ద గుంటలతో. ఈ మధ్యే కాస్త రోడ్ వేసారు. వేసిన ఆరు నెలలకే మాల్లి అక్కడక్కడ గుంటలు పడ్డాయ్. ఫుట్ పాత్ ఇప్పటికీ ప్రమాదకరంగా నే వుంది.

అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. చాలా దేశాల్లో రోడ్ కి ఏవిధమైన గుంట పడినా అధికారులు అక్కడికి  12 గంటలల్లోపు చేరుకోవాలి. 24 గంటల్లోపు అక్కడ ఆ గుంతని పూడ్చేయాలి. అలాంటి సిస్టం మనం కూడా అమలు చేయాలి.
2. లైసెన్సు జారి చేసే విధానం పూర్తిగా మారిపోవాలి. సొంత డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అందులో కొన్ని దశల్లో డ్రైవర్ యొక్క సామర్ధ్యాన్ని పరీక్షించే పూర్తిగా శిక్షణ తీసుకున్న తరువాతే లైసెన్సు జారి చేయాలి.
3. ప్రతి 10, 15 కిలోమీటర్ కి ఒక చెక్ పాయింట్ ఏర్పాటు జరగాలి. ప్రతి వాహనం యొక్క కదలికలు వారి నేచర్ మొత్తం రికార్డెడ్ గా వుండాలి. ఇది ప్రమాదాలను నివారించడానికే కాకుండా ఇంకా అనేక విషయాల్లో ఉపయోగ పడుతుంది. ఇప్పుడు వేసే రోడ్స్ అన్ని PPP పద్దతే కనుక టెండర ఇచ్చే సమయంలోనే ఇలాంటి నిభందన అమలు చేయొచ్చు.
4. నిభందనలని పారదర్సాకంగా అమలు చేయాలి.

5. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని శాస్త్రీయంగా అద్యయనం  చేసే వ్యవస్త, సత్వరమే తగు చర్యలు తీసుకొనే అధికారాలు వుండాలి.
6. వాహనాలకి అనుమతులు ఇచ్చే సమయంలో వాటిని వివిధరకాలుగా పరీక్షించాలి. ఈ తుఫాన్ అనే వాహనాలు తరచుగా ప్రమాదాలకి కారణాలు అవుతున్నాయి. అలాంటి వాహనాలని శాస్త్రీయంగా అద్యయనం చేసి కంపెనీలకి సూచనలు ఇచ్చి తగు మార్పులు చేయించాలి.
7. జరిమానాలతో సరిపెట్టకుండా సరైన నిర్ణయాలు తీసుకొని వాహన దారులకి అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలి. ముక్యంగా తప్పు చేసి దొరికిన వాహన దారులని వదిలి పెట్టకుండా వాళ్ళు మల్లి ఆ తప్పు చేయని విధంగా కౌన్సెలింగ్ ఇప్పించాలి.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. తాము వాహనాన్ని నడిపేందుకు పూర్తిగా సిద్దంగా వున్నామా లేదా అని తమకి తాము పరీక్షున్చుకోవాలి.
2. ఒకవేళ డ్రైవర్ వుంటే అతని పరిస్తితిని అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి 2 గంటల ప్రయాణానికి ఒక 5, 10 నిమిషాలు గాప్ తీసుకుంటూ వెళ్ళడం మంచిది. అదికూడా ఒకరోజులో గరిష్టంగా 8 నుండి 10 గంటల ప్రయాణం మాత్రమె చేస్తే ఎటువంటి అలసటా వుండదు.
3. ముక్యంగా తెల్లవారు జాము 1 నుండి 6 గంటల మద్య వాహనాలు నడపడం మంచిది కాదు. పూర్తిగా ఈ సమయాన్ని తప్పించి డ్రైవింగ్ ప్లాన్ చేసుకోవడం మంచిది.
4. యెంత అనుభావగ్నుడైనా ఒక్కోసారి ప్రమాదం జరగోచ్చు కనుక డ్రైవింగ్ లో ఎప్పుడూ భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి. ఆకతాయి తనం పనికిరాదు. మనకి ప్రమాదం జరక్క పోయినా మన ఆకతాయి తనం వాళ్ళ ఇతరులకి ప్రమాదం జరగోచ్చు.
5. నడిపే వాహనం యొక్క కండిషన్ తప్పక చెక్ చేసుకోవాలి. ముక్యంగా బ్రేక్, టైర్స్ అండ్ లైట్స్ వంటి ముక్యమైనవి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి.
6. అధికారులు గాని ప్రభుత్వాలు గాని డ్రైవింగ్ సూచనలు చేసేది మన మంచికే అని గ్రహించి వాటికి తగినట్టు నడుచుకోవాలి. లేదంటే ప్రమాదం జరిగేందుకు మనకి మనమే దగ్గరవుతున్నట్టు.
7. బండికి నిర్దేశించిన వ్యక్తుల కన్నా ఎక్కువమంది బండి లో ప్రాయానిస్తే అదుపుతప్పే ప్రమాదం వుంది. కనుక ఏ ఒక్కరో అయితే పర్లేదు గాని మరీ రెట్టింపు మంది ప్రయాణించడం మానుకోవాలి. బడ్జెట్ గురించి ఆలోచిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే. 

Monday, June 8, 2015

::: చంద్రబాబు ఓటుకి నోటు :::

మన రాజకీయ వ్యవస్తలో ఇలాంటి విషయాలు సర్వ సాధారనమైపోయాయి. మనం రాసుకున్న రాజ్యాంగం, పీనల్ కోడ్స్ అందరూ మర్చిపోయి ఇవి సాధారణ విషయాలుగా పరిగణించే స్తాయికి వ్యవస్తలు నాశనం అయ్యాయి. కెసిఆర్ కావాలని చేసినా లేక ఇంకే ఉద్దేశంతో చేసినా అది అప్రస్తుతం. చేసింది నేరం. ఇక దానికి కారణాలు వెతకడం దండగ. ఈ విషయాన్ని బేస్ చేసుకొని రెండు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం ఇక చంద్రబాబు అండ్ కో ఆపేసి కాస్త విజ్ఞతతో ఆలోచించాలి. 
అస్సలు ఈ సంభాషణ టాప్ ద్వారా జరిగింది కాదు. ఇది స్టీఫెన్ తన మొబైల్ లో రికార్డు చేసింది కావచ్చు లేదా చంద్రబాబు PA (బాస్ మాట్లాడతారు అన్న వ్యక్తి) రికార్డు చేసింది కావచ్చు. ఎందుకంటె టాప్ చేస్తే ఫోన్ రింగ్ రికార్డు అవ్వడం జరగదు. కాబట్టి  టాపింగ్ జరిగింది అని మీరు ఇప్పటికిప్పుడు నిరూపించలేరు. ఒకవేళ ఇంకేమైనా రికార్డ్స్ కెసిఆర్ బయటపెడితే తప్ప.
  

అలాగే ఒక ముఖ్యమంత్రి ఫోన్ టాప్ చేయడం తప్పు అనే ముందు మీరు వాళ్ళ శాసనసభ్యుడిని  కొనాలని చూడడం తప్పు కాదా అని ఆలోచించండి. అలాగే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి జంప్ చేసే సమయంలో ఇచ్చే నజరానాలను దీనితో పోల్చవద్దు. ఎందుకంటె ఇది పార్టీ మారేందుకు ఇచ్చింది కాదు. ఇది వోటు వెయ్యడానికి ప్రలోభపెట్టే కేసు. కనుక మీరు మీ వాదనలన్నిటినీ పక్కన పెట్టడం మంచిది. అస్సలు ఎలెక్షన్ కమిషన్ సుమోటో గా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్ధం కాదు. ఒకవేళ కెసిఆర్ గాని లేదా స్టీఫెన్ గాని ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేస్తే మీ బతుకేమిటో ఆలోచించండి. ఇది acb కేసు మాత్రమె అయితే మీవాళ్ళు కొంత బయట పడినట్లే. 

అలాగే ఇన్నాళ్ళు అవినీతి అవినీతి అని కారుకూతలు కోసిన మీ పార్టీ ముదురు నాయకులు యనమల, పరకాల ఇప్పుడు మీకు వంత పాడడం చూస్తుంటే అవినీతి, దొంగతనం హత్యా రాజకీయాలు లాంటివన్నీ చేయడానికి రాష్ట్రంలో మీ పార్టీ వాళ్లకి మాత్రమె రైట్స్ వున్నట్టు వ్యవహరించడం సిగ్గుపడాల్సిన విషయం. 

అలాగే రేపు రేవంత్ అప్రూవర్ గా మారితే అతని ప్రాణానికి లేదా స్టీఫెన్ ప్రాణానికి యెంత అపాయముందో కూడా ప్రజలకి తెలుసు. ఈ మురికిని ఎదుర్కొనే సత్తా ప్రస్తుతానికి తెదేపాకి లేదు. కాని ఏమైనా జరగోచ్చు ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టే ఒక ప్రణాళిక తో ముందుకెళ్తే కెసిఆర్ కాస్త వెనకడుగు వేయొచ్చు. కాని అది ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ తాట తీసేస్తారు. 
ఇక పొతే ఇదేదో రెండు ప్రభుత్వాల మద్య నీటి గొడవలా ఆంధ్ర అధికారులు తలదూర్చడం మరీ సిగ్గుచేటు. ఆంధ్ర పోలీసులకి లేదా బ్యురోక్రాట్స్ కి తెలియదా ఇది యెంత పెద్ద నేరమో. దాన్ని కప్పిపుచ్చడానికి మల్లి మీరు పావులుగా మారకండి. అది మీ మెడకి చుట్టుకొని చివరికి శ్రీలక్ష్మి లా అయిపోతారు.  
విశేషమేమంటే మీరు పాలించినా, దొంగలై దొరికినా ప్రజల ఆస్తులకే పెద్ద బొక్క. కానివ్వండి ప్రజలు ఎన్నాళ్ళో చూస్తూ ఊరుకోరు. తిరగబడే రోజు వస్తుంది.
ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా ప్రజల్లో కాస్త చైతన్యం వచ్చి ఆలోచిస్తారేమో చూడాలి. నాయకుల్లో భయం మాత్రం పెరిగింది. ఇకనైనా ఇలాంటి చర్యలు తగ్గుతాయి అని ఆశిద్దాం.

Thursday, June 4, 2015

::: రేవంత్ రెడ్డి :::

"చంద్రబాబు సొంత ఆస్తులమ్మి రుణమాఫీ చేయడు, ఏ నాయకుడు తన సొంత ఆస్తి అమ్మి ప్రజలకి ఏమీ చేయడు" ప్రజలు రుణమాఫీ అంటేనే ఓట్లు వేసారు. లేదంటే వేసేవాళ్ళు కాదు. ప్రజల్ని అబద్దాలతో అయినా నమ్మిన్చినోడికే ఒట్లేస్తారు. అందుకే నమ్మిన్చాం" 

ఈ మాటలు ఒక సంధర్బంలో రేవంత్ రెడ్డి అన్నవే. కొన్ని నిజాలని ధైర్యంగా చెప్పగలగడం వల్ల వున్నోల్లలో కాస్త మంచివాడు అనిపించాడు నాకు. తెదేపా లో కాస్త నచ్చే నాయకుడు. ముక్యంగా తెలంగాణా తెదేపా లో ఇంతకూ మించి ప్రస్తుతం ఎవరూ లేకపోవడం కూడా అందుకుకారణం కావచ్చు.
ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ లో చాలా విషయాలు నిర్మొహమాటంగా చెప్పాడు. దేశంలో అవినీతి గురించి రాజకీయపార్టీ నాయకులు చేసే పనులగురించి కూడా. కాని ఇప్పుడిలా తనే ఇలా బలిపశువు అవుతాడు అనుకోలేదు.
-----------------------------------------------------------------------------
        అందరి టార్గెట్ ఒకటే అయినప్పుడు ఇలాంటివి జరుగుతాయ్...
----------------------------------------------------------------------------
సొంతపార్టీలో ఎర్రబెల్లి...
తెలంగాణా అధికార పార్టీలో అందరికీ కొరకరాని కొయ్య...
జగన్ కి కూడా మంచిదే (తన అవినీతిని ప్రజలు మర్చిపోతారు)
అటు కాంగ్రెస్ పార్టీ లో సొంత మనిషి జై పాల్ రెడ్డి...
ఇటు సొంత పార్టీలో తెలంగాణా అద్యక్షుడు అవుతాడేమో అని భయపడేవాళ్ళు...
ముందు ముందు కుమారుడికి అడ్డురావోచ్చేమో అనే భయం కూడా కావచ్చు...
ఇలాంటి  కారణాలు అన్ని కలిపి మొత్తంగా రేవంత్ ని ఒంటరివాడిని చేసి భలే ఇరికించారు. రేవంత్ స్తానంలో ఏ చినబాబో  వుంటే పరిస్తితి ఇలా వుండేది కాదు. 

అవినీతికి వ్యతిరేకంగా చూస్తె ఇలా జరగడం మంచిదే కాని ఇలాంటి కార్పొరేట్ పార్టీలో ఉంటూ కాస్తో కూస్తో నిజాయితీ గా వ్యవహరించే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ముందుగా బుక్ అవ్వడం కాస్త ఇబ్బందికరమైన పరిస్తితే
తెలంగాణా రాష్ట్రసమితి పార్టీలో కి ఎంతమంది వెళ్ళలేదు, కాంగ్రెస్ లోకి తెరాస నుండి ఎంతమంది పోలేదు, నాడు ycp లోకి పెద్ద పెద్ద నాయకులే పోయారు. కాంగ్రెస్ నుండి తెదేపా లోకి ఎంతమంది, కమ్యూనిస్ట్ పార్టీల నుండి ఎంతమంది  వెళ్ళలేదు.  ఇవన్నీ డబ్బు ప్రమేయం లేకుండా జరిగాయా? కాదుగా? ఇప్పుడు కూడా రేవంత్ ని పట్టించిన వ్యక్తికి అంతకన్నా ఎక్కువ డబ్బే ముట్ట చెప్పివుంటారు. అలాగే ఈ శాసనమండలి ఎలెక్షన్లు ఎప్పుడూ ఇలా అమ్ముడుపోవడానికి కొనుక్కోవడానికి వెసులుబాటుగా వున్తున్నాయ్. అసలు అంతా డబ్బే లోకంగా నడుస్తున్న పార్టీలలో ఇలాంటివి చాలా చాలా సహజం. కాని ఒకర్ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చు. అది కూడా రేవంత్ కావడం కాస్త నన్ను ఫీల్ అయ్యేలా చేసింది. దానికి కారణం ముందే చెప్పాను. కేవలం అతని ఐడియాలజీ మాత్రమె
అలా అని అతికోక్కడికే నేను అవినీతి చేసుకొనే రైట్స్ ఇచ్చినట్టు కాదు. అతని ఐడియాలజీ బావుంటుంది. జనాలు ఇలాగే ఉండ మంటున్నారు. నిజాయితీగా ఉండే వాళ్లకి ఒత్లేస్తున్నారా... అని ప్రశ్నించే స్వభావం తనది. నిజమే నాయకుడిగా ఎదుగుదాం అనుకొనే ఒక  టార్గెట్ ఉన్న వ్యక్తీ చేయాల్సినవి ఇలాంటివేగా... ప్రజలు ఇలాగే వున్దమన్తున్నారు. ప్రజలు నాయకుల అవినీతిని చాలా లైట్ తీసుకుంటున్నారు. లేకపోతె జగన్ లాంటి అవినీతి ఆరోపణలు వున్నా వ్యక్తీని ఎలా ప్రతిపక్ష నాయకుడిని చేస్తారు.
ప్రజలు అవినీతి పరుడ్ని నాయకుడిని చేస్తుంటే, నాయకుడు కావాలి అనుకున్నోడు నిజాయితీగా ఎలా ఉండగలడు. అలా వుండే తత్వం అందరికీ వుండదు. వెసులుబాటు కూడా వుండదు ఉన్నా మిడిల్ డ్రాప్స్ చాలా ఉంటాయ్. ఈ సొసైటీ అలాగ చేయమంటుంది.
ఇప్పుడు కెసిఆర్ చేసిన పని బావుంది. అలాగే తన పార్టీలోకి వచ్చినప్పుడు తలసానికి, కడియంకి ఎంతిచ్చాడో కూడా చెప్తే బావుంటుంది. అప్పుడు అనగలం కెసిఆర్ మంచి నిజాయితీ పరుడు అని. నెత్తిన పెట్టుకోనేవాళ్ళం. కాని అలా జరగదే. తన అధికారం లో వున్నా పార్టీ లకి ఈ వెసులుబాటు వుంటుంది. ఇప్పుడు కెసిఆర్ కి వుంది. భవిస్యత్తు లో ఇలాంటివి కెసిఆర్ కి కూడా ఎదురు కావచ్చు. తానెంత నిజాయితీ పరుడో ముందుముందు తెలుస్తుంది. కాని కెసిఆర్ ని మెచ్చుకొని తీరాలి. ఇలాంటి ఒక ఆతని మొదలు పెట్టినందుకు. ఎందుకంటె ఈ ఆట మొత్తం రాజకీయ పార్టీల  మొత్తాన్ని ఆలోచనలో పడేస్తుంది. అలాగే ప్రజల్ని కూడా. 
ఇది మంచిదే, ఇలాగే జరగాలి. కాని రేవంత్ లాంటి కాస్తో కూస్తో మంచి ఐడియాలజీ  వున్నా నాయకుడితో స్టార్ట్ అవ్వడం ఇబ్బంది గా వుంది.

Thursday, May 28, 2015

::: మా జామచెట్టు vs రాజధాని :::

::: మా జామచెట్టు vs రాజధాని  :::



మా జామచెట్టు. మా తాత వేసిన చెట్టు. కాయల సైజు చిన్నగా ఉంటాయ్. కాని లోపల అంతా పింక్ కలర్ లో చాలా అందంగా, తియ్యగా ఉంటాయ్. ఊళ్ళో ప్రతి పిల్లోడికీ దానిమీదే చూపు. రెండు తరాలం ఎంతో ఇష్టంగా ఆ చెట్టు కాయలు తింటూనే వున్నాం. ఇప్పుడది ఒక జ్ఞాపకం కాబోతుంది.  అలాగే దారిపొడవునా రేగిచేట్లు చేయి చాచి కోసుకొని తినేంత దగ్గరలో. తాటికాయలు, ఈతకాలు. పచ్చని పైరుల మద్య అరుగులు. ఇంకా ఎప్పటికీ  ఆ మధురమైన భావనలు మా జ్ఞాపకాల్లోనే. ఇలాంటి వాటికోసమే సెలవోస్తే ఎక్కడెక్కడో  ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు తమ ఊళ్ళకి వెళ్ళేది. అలాంటి ఆటవిడుపు గ్రామాలు మా పొలాలు ఇక జ్ఞాపకాలే.




ఎందుకంటె మాకు రాజధాని వచ్చింది. ఒక పక్క సంతోషం. మొరోపక్క ముల్లులా గుచ్చుకొనే వాస్తవాలు, జ్ఞాపకాలు. నాలాగే చాలామంది ఇప్పుడున్న మంచి జీవితాన్ని, వాతావరణాన్ని, జ్ఞాపకాలని వదిలేసి మదిలో ఏవేవో కొత్త ఆశలతో రోజుల్ని భారంగా నేట్టేస్తున్నాం. తప్పదు.

కోట్లడబ్బు ఆనందాన్ని ఇస్తుంది అని ఏ కోటీశ్వరుడు చెప్పట్లేదు. కాని కోట్లవైపు మధ్యతరగతి చూస్తూ స్వత్చమైన ఆనందాన్ని ఇస్తున్న ఎన్నో జ్ఞాపకాలని పరిస్తితుల్ని వదిలి వెళ్తున్నాం.

కాని ఒక్కటి మాత్రం నిజం. ఇలాంటి పచ్చని పొలాలు ఇజ్రాయిల్ లాంటి దేశాల వాళ్లకి వుంటే వాళ్ళు ఈ పని చేయరు అని నమ్ముతా. ఎందుకంటె చుక్క నీటికోసం, ఒక మొక్క పెంచడం కోసం వాళ్ళు అక్కడ ఎంతకస్తాపడుతున్నారో ప్రపంచానికి తెలుసు. మనకి ఉండి నాశనం చేసుకుంటున్నాం. లేక వాళ్ళు కష్టపడుతునారు.

అలాగే మనం ఏం చేస్తున్నామో కూడా ఆలోచించు కోవాలి. ఇక్కడ రాజధాని వస్తుంది అని, అలాగే ఎక్కువ ధర వస్తుంది అని మనం మన భూములని స్వచ్చందంగా ఇచ్చినా ఆ వచ్చిన డబ్బుతో ఏం చేయాలి. ఈ మద్య కాలంలో భూమి విలువే అత్యంత వేగంగా పెరుగుతుంది. దానికి కారణం కూడా ప్రజలు, వాళ్ళ అవసరాలు పెరిగిపోవడం. అలాంటి భూమిని వదిలేసి, చిన్న స్తలం రాజధానిలో ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం. లేదా మల్లి ఎక్కడో ఒకచోట భూమిని కొనుక్కోవాలి. సరే కొనుక్కుంటాం కాని ఇక్కడున్నంత నీటి వసతి, భోగోలికంగా నష్టం చేయని వాతావరణం, అలవాటు పడ్డ వ్యవసాయం ఇవన్నీ ఉంటాయా. సరే వున్నా రేపు మల్లి ఏ సెజ్ కో అవి కూడా లాక్కోరు అని నమ్మగలమా.

నిర్మాణంలో ఉన్న ప్రకాశం బారేజి
మనం ఎంతో మందిని కాలి చేయించి ప్రకాశం బారేజి కట్టుకున్నది దేనికోసం, నీటి అవసరాలకి, వ్యవసాయానికి. ఇలా నీటిని ఒడిసిపట్టి సాగులోకి తెచ్చుకున్న సాగుభూములనే  నాశనం చేసి కట్టడాలు కట్టేందుకు ఉపయోగిస్తున్నారు అంటే యెంత అనాగరికమైన చర్యో అర్ధం చేసుకోవచ్చు. భూమికి మనం భారం కాకూడదు. ఎందుకంటె అది మనల్ని భారం అనుకుంటుంది తప్పకుండా.

అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం. దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా ఉంటున్న ఆ నేల ఎన్ని కోట్ల విలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా.

అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు.
రైతుకి భూమి విలువ పెరగడం అంటే తనపోలం అన్నపూర్ణగా ఉన్నప్పుడే. "నీకేంట్రా సాంబయ్యా నీ పొలం మూడు పంటలు పండుద్ది నీకన్నా లచ్చాదికారి ఎవడ్రా వూళ్ళో" అంటుంటారు ఇప్పరికీ గ్రామాల్లో. ఇలాంటి అన్నపూర్ణగా ఉన్న నేల ఈ రెండు జిల్లాలలో ఇంకోచోట లేదు.
కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు పెరగడం కన్నా దాని విలువ పెరగడమే ముక్యం.
రాజధానే కట్టాల్సివస్తే ఇప్పుడు అనుకొనే తుళ్ళూరు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని ఉపయోగించి రాజధాని కట్టి దానికి విలువ పెంచితే చాలా చాలా బావుండేది. అది వదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే అది సమర్ధనీయం కాదు. అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.

ఎందుకంటె ఈ దేశం లో ఇలాంటి చర్యలే జరుగుతుంటే ఇంకొన్నాళ్ళకి అన్నపూర్ణగా ఉన్న మనదేశం అన్నమో రామచంద్రా అని ఇజ్రాయిల్ లాంటి దేశాలని అర్దిన్చాల్సివస్తుంది.

Wednesday, May 27, 2015

ప్రజారోగ్యం పట్టని పాలకులు


ఇవేమీ ప్రభుత్వాలో, వీల్లేమి అధికారులో అర్ధం కావడంలేదు...
ఫ్రూటి..... ప్రతి రుతువులోను మావిడి పళ్ళు అంట...
అందులో ఉండేవి మొత్తం కెమికల్స్.... అయినా మామిడికాయ జ్యూస్ అని ఆడ్స్...
పట్టించుకోనేవాడు లేడు...

కంప్లన్... ఇది తాగితే బాగా ఎదుగుతారు అంట...
అయితే నేను చూపించిన వాడికి తాగించి ఎదిగేలా చేయమనండి... అబ్బే అది కుదరదు...
ఆడ్స్ లో మాత్రం తాగితే చాలు చురుకుదనం వస్తుంది అంటారు...
పట్టించుకోనేవాడు లేడు...
సంతూర్ సోప్... వయసు కనపడదంట...
బామ్మలకి కూడానా...
తెలీదు పట్టించుకొనే వాడులేడు...
బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుందంట... ఎవడికో అర్ధం కాదు.
ఇవన్నీ కాక యేవో నాలుగు రసాలు కలిపి ఒక పదార్ధం తయారు చేసి గంటలు గంటలు టీవీల్లో ఊక దంపుడు ఆడ్స్.... వాటికి సెలబ్రిటీ లు ప్రమోటర్స్...
మన ఖర్మ.
అప్పుడెప్పుడో ఒక హెయిర్ ఆయిల్ వచ్చింది ఫుల్ పేజి యాడ్స్ తో...
న్యూ జెన్ హెర్బల్ హెయిర్ ఆయిల్... వాళ్ళ ఆడ్స్ ఎలా వున్నాయి అంటే శవానికి కూడా బట్టతలా పోగోడతాం అన్నట్టు ఇచ్చారు. బాగా కాసులు కురిపించుకున్నారు.
మన అమాయకత్వమే వాళ్ళ పెట్టుబడి.
అసలే సహజ సిద్దమైన ఆహారానికి దూరమై నిదానంగా 30, 40 ఏళ్ళకే ముసలోళ్ళ మాదిరి అయిపోతున్నాం... దానికి తోడు వీళ్ళు ఇచ్చే ప్రకటనల మోజులో పడి రోజు రసాయనాలు తాగుతూ ఉన్న కాస్త ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం.
అసలు వీటన్నిటికీ అనుమతి ఇచ్చే వాళ్ళని ఏంచేసినా తప్పులేదు.
మనం గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ప్రజారోగ్య వ్యవస్త ఒకటి వుంది. పూర్తిగా ఆ వ్యవస్తని నిర్వీర్య పరిచిన మన పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని, ఆయుష్షుని ఎప్పుడో తాకట్టు పెట్టారు. ఇది క్షమించరాని నేరం.

ప్రకటనల కోసం ఏ యాడ్స్ పడితే ఆ యాడ్స్ వేసే చానల్స్ ని కంట్రోల్ చేసే వ్యవస్త తక్షణ అవసరం.
యాడ్స్ రూపకల్పనలో కూడా ఎటువంటి అభూత కల్పనలు లేకుండా వాస్తవాలను చెప్పే ప్రయత్నం వుండాలి.
అలా లేని వాటిని అనుమతించని ఒక వ్యవస్త కావాలి.

యేవో నాలుగు రకాల చుక్కలు పెట్టి ప్రజల్ని మబ్యాపెట్టే ఆడ్స్ వేస్తూ చోద్యం చూస్తున్న ప్రభుత్వాల తీరు ఇక నైనా మారాలి. లేదంటే ఇప్పుడు ఎవ్వనస్తులతో నిండిన మన దేశం పూర్తిగా రోగిస్తులతో నిండడానికి ఎక్కువ కాలం పట్టదు..
కనీసం ఆహార సంబందిత ప్రొడక్ట్స్ మీద అన్నా ఖటిన మైన వ్యైఖరి అవలంబించని ప్రభుత్వాలు, అధికారులు, చానల్స్ లని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనం మారితే వీళ్ళు మారతారు.
తినే, తాగే ప్రతి పదార్ధం సహజ సిద్దంగా వుండేది గా చూసుకోండి. లేదంటే మీ ఆరోగ్యం ఒక్కటే కాదు మీ ద్వారా మీ తరువాతి తరాలకి కూడా రోగ సంక్రమణ జరుగుతుంది.